బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీమణుల వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారం కిందనే బెంగాలీ నటి పల్లవి డే చనిపోయింది. ఆ వార్త మరవకముందే తాజాగా మరో నటి సూసైడ్ చేసుకుంది.
బెంగాలీ ఇండస్ట్రీలో ఒకే నెలలో ఇద్దరు యాక్ట్రెస్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలవరపెడుతోంది. నటీమణుల వరుస ఆత్మహత్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. వారం కిందనే బెంగాలీ నటి పల్లవి డే తన ప్లాట్ లో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో నటి కూడా సూసైడ్ చేసుకోవడం సినీ లోకాన్ని షాక్ కు గురిచేసింది. ఒకే నెలలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మే 11న బెంగళూరు కు చెందిన యవ డాన్సర్ టీనా సాధు, మే 12న కేరళలకు చెందిన షహనా, మే 16న బెంగాలీ సీరియల్ యాక్ట్రెస్ పల్లవి డే ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా మరో బెంగాలీ నటి బిదిషా డి మజుందార్ (Bidisha De Majumdar) ఆత్మహత్య చేసుకుంది.
బిదిషా డి మజుందార్ (21) ఒక ప్రముఖ బెంగాలీ మోడల్, నటిగా గుర్తింపు పొందింది. వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతాలో తన అపార్ట్‌మెంట్‌లో కొద్ది రోజులు నివసిస్తోంది. నిన్న అదే ప్లాట్ లో శవమై కనిపించింది. తన చావుకు గల కారణాలను తెలుపుతూ సూసైడ్ నోట్ కూడా రాసింది. అయితే బిదిషా గత నాలుగు నెలలుగా అక్కడే నివసిస్తోంది. మే 25న సాయంత్రం విషయం తెలుసుకున్న బరాక్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని, సూసైడ్ లెటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బిదిషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్‌జి కర్ ఆసుపత్రికి తరలించారు.
అయితే బిదిషా అనుభాబ్ బేరా అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో ఉన్న సంబంధం కారణంగా ఆమె కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆమె స్నేహితులు పేర్కొంటున్నారు. మోడలింగ్ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన బిదిషా దే మజుందార్, 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వంలో ‘భార్- ది క్లౌన్’ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ప్రముఖ నటుడు దేబ్రాజ్ ముఖర్జీ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
