ఓటీటి ప్లాట్ ఫామ్ ల మధ్య తెలుగులో  పోటీ పెరిగిపోతున్న నేపధ్యంలో తమ ఉనినికి కాపాడుకోవటం కోసం బూతుని ఆశ్రయిస్తున్నారు. ఏదన్నా అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు చేస్తే అది సినిమానా..మేము చేస్తే అది బూతు అవుతుందా అని ఎదురుదాడికి దిగే పరిస్దితి. దానికి తోడు  చిన్న చిన్న సినిమాలు ఆడాలంటే  అడల్ట్ కంటెంట్‌ తప్పదనే ఓ వర్గం తయారైంది.   ఆ మధ్య వచ్చిన ‘ఏడు చేపల కథ’, ‘వైఫ్ ఐ’ సినిమాలు ఈ కోవకు చెందినవే.ఆ సినిమాలు ఆడకపోయినప్పటికి తక్కువ బడ్జెట్ తో ఒక షో హౌస్ ఫుల్ అయ్యి..డబ్బులు చేసుకునేవి. ఇప్పుడు ఇలాంటి సినిమాలకు ఇప్పుడు ఓటీటీ, ఏటీటీ ప్లాట్‌ఫాంలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో సినిమా రంగంలోకి దూకింది.  టెమ్ట్ రాజా టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో పోసాని వంట్ నటుడు కూడా కనపించటం మరో విచిత్రం. ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా “Tempt రాజ”. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.  ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ… “Tempt రాజ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ని అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసాం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుపుతాము. పోసాని కృష్ణ మురళి గారి పాత్ర సినిమాలో కొత్తగా ఉంటుంది. నేను హీరోగా నటిస్తూ… నిర్మించిన ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నా’ అన్నారు.

‘డిగ్రీ కాలేజ్’ ఫేమ్ దివ్య రావు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. ఆస్మ సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించింది. పోసాని కృష్ణమురళి, యాంకర్ శ్యామల, టార్జెన్, జయవాణి, జోగి బ్రదర్స్ (కృష్ణ, నాయుడు), గౌతంరాజు, అశోక్ కుమార్, మేఘన చౌదరి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ దొరబాబు, మైత్రి రజిత, దీప్తి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. హరి గౌర సంగీతం సమకూర్చారు. రామజోగయ్య శాస్త్రి, హరి గౌర, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.