ప్రముఖ దర్శకుడు శంకర్ టైమ్ బాగున్నట్లు లేదు. రామ్ చరణ్‌ తో శంకర్ సినిమా ప్రకటించగానే లైకా ప్రొడక్షన్ వారు తమ 'ఇండియన్ 2' సినిమా పూర్తి చేయకుండా వేరే ప్రాజెక్ట్ చేపట్టరాదని లీగల్ నోటీస్ పంపారు. ఇప్పుడు రణ్ వీర్ తో శంకర్ సినిమా అధికారికంగా ప్రకటించగానే అస్కార్ రవిచంద్రన్ లీగల్ నోటీస్ ఇచ్చారు.  

వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా రణ్‌వీర్ సింగ్ హీరోగా శంకర్ హిందీలో అన్నియన్ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా తాను నిర్మించిన 'అన్నియన్' సినిమాను హిందీలో రీమేక్ చేస్తామని ప్రకటించటం పై రవిచంద్రన్ శంకర్ కు లీగల్ నోటీస్ ను పంపినట్లు సమాచారం. తను హిందీ రీమేక్ ప్రకటన వినగానే షాక్ అయ్యానని, అన్నియన్ పూర్తి కథాహక్కులు రచయిత సుజాత నుంచి తాను కొన్నానని అందుకు గాను పూర్తి పేమెంట్ కూడా చేశానని అంటున్నారు రవిచంద్రన్. ఈ కథకు సబంధించి ఎడాప్టేషన్, రీమేక్, మెయిన్ ప్లాట్ కాపీ అనేవి పూర్తిగా ఇల్లీగల్ అంటున్నారు.  

2005 లో  'అన్నియన్'గా తమిళ్ లో, తెలుగులో 'అపరిచితుడు'గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ హిట్‌గా రికార్డులు తిరగరాసింది. ఇదే తరహా కథతో తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశారు శంకర్. భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూ పలు బిగ్గెస్ట్ హిట్స్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ శంకర్ ఇప్పుడు మరో  బిగ్గెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న ఆయన మరో బిగ్ మూవీ అనౌన్స్ చేశారు. 

తన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయిన 'అపరిచితుడు' కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌లో మరో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.  విక్రమ్ హీరోగా తమిళంలో 'అన్నియన్'గా, తెలుగులో 'అపరిచితుడు'గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ హిట్‌గా రికార్డులు తిరగరాసింది. హిందీలో కూడా విడుదల చేసినప్పటికీ అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో ఇప్పుడు 16 ఏళ్ళ అనంతరం మళ్ళీ దర్శకుడు శంకర్ అపరిచితుడు పాత్రతోనే కొత్త తరహా కథను రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందనుంది.

ఈ భారీ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నారు. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ భారీ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2022 మిడిల్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు శంకర్. 2023లో రిలీజ్ చేయచ్చని తెలిసింది. దీంతో ఈ భారీ సినిమాపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది.