అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం,సైరా సెట్ దగ్దం

అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ అగ్ని ప్రమాదం,సైరా సెట్ దగ్దం

హైదరాబాద్  అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగగా రెండు సినిమా సెట్టింగులు కాలిపోయాయి.  ఘటనా స్థలానికి ఫైర్‌ సిబ్బంది ఆలస్యంగా చేరుకోగా..  4 ఫైరింజన్ల సిబ్బంది మంటలు అదుపు చేసే యత్నం చేస్తున్నారు.

 

ప్రమాదానికి షాట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. స్టూడియోలోని సెట్టింగ్స్ దగ్దమవుతున్నట్లు తెలిసింది. మనం సినిమా కోసం వేసిన సెట్ తో పాటు దాని పక్కనే చిరంజీవి సైరా సినిమా కోసం వేస్తున్న భారీ సెట్ కూడా దగ్దమైనట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సిన సైరా సెట్ దగ్దమవటంతో షూటింగ్ మరికొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

ఇక ఈ ప్రమాదం వల్ల జరిగిన నష్టంస ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ స్టూడియో అక్కినేని కుటుంబానికి చెందిందని తెలిసిందే. సినిమాలతోపాటు పలు సీరియళ్లు, రియాల్టీ షోలు ఇక్కడ షూటింగులు జరుపుకుంటాయి. ఘటన గురించి తెలియగానే హుటాహుటిన అక్కడి చేరుకున్న నాగార్జున మీడియాతో మాట్లాడారు.

 

నాగేశ్వరావుగారి జ్ఞాపకార్థం నిలుపుకున్న మనం సినిమా సెట్‌తోపాటు.. చిరు సైరా నరసింహారెడ్డి కోసం వేసిన ఓ సెట్‌ కాలిపోయినట్లు చెప్పారు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఏ హాని కలగకపోవటం సంతోషకరమని నాగ్ వ్యాఖ్యానించారు.

 

ప్రమాదం వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. http://telugu.asianetnews.com/video/annapurna-studio-fire-accident

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos