హిందీ టీవీ రంగంలో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అంకిత లోఖండే.. ఇటీవల 'మణికర్ణిక' చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన జుల్కరి బాయ్ పాత్రకి మంచి పేరు దక్కింది.

గతంలో నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం అతడితో విడిపోయింది. ఇటీవల కాలంలో ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త విక్కీ జైన్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు వాస్తలు వచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన ఆమె విక్కీ జైన్ ని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అతడు చాలా మంది వ్యక్తని.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరినీ పిలిచే చేసుకుంటానని.. ప్రస్తుతానికి అటువంటి ప్లాన్స్ లేవని చెప్పింది.

తాజాగా ఈ జంట తమ స్నేహితుల ఇంట పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంలో అంకిత తన ప్రియుడు విక్కీని దగ్గరకు తీసుకొని అందరూ చూస్తుండగానే ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.