సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హోమ్లీగా ట్రెడిషనల్ లుక్ ని తెరపై చూపించిన అంజలి ఇప్పుడు చాలా మారిపోయింది. గ్లామర్ గర్ల్ గా నటించడానికి రెడీ అంటూ.. సినిమా కంటెంట్ ను బట్టి  ఎలాంటి డ్రెస్సయినా వేస్తాను అంటోంది. ఇకరీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అంజలి తనపై వస్తోన్న రూమర్స్ కు ఘాటు రిప్లై ఇచ్చింది. 

గతంలో కోలీవుడ్ హీరో విజయ్ తో కలిసి చక్కర్లు కొడుతూ.. ఫోటోలకు పోజులిచ్చిన అమ్మడు దాదాపు పెళ్లి పీటలెక్కబోతోంది అనే రేంజ్ లో టాక్ అందుకుంది. ఏమైందో ఏమో గాని చివరికి అసలు ప్రేమే లేదు అన్నట్లు కౌంటర్ ఇచ్చింది. రీసెంట్ గా అయితే తానెప్పుడూ ఎవరిని లవ్ చేయలేదు అన్నట్లు మాట్లాడింది. 

ఇక పెళ్ళయితే సినిమాలు చేయడం మానేస్తాను అని వస్తోన్న రూమర్స్ కు కూడా చెక్ పెట్టింది. ప్రస్తుతం కోలీవుడ్ లో మూడు సినిమాలతో బిజీగా ఉన్నట్లు వివరిస్తూ తనకు నచ్చితే హాట్ కనిపించడానికి కూడా రెడీ అని తెలిపింది.