అంజలి హీరోయిన్ గా చిత్రాంగద పిల్ల జమీందార్ దర్శకుడు అశోక్ తెరకెక్కించిన చిత్రాంగద ట్విస్టులతో. ఉత్కంఠతో సాగే చిత్రం చిత్రాంగద

కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఓ యువతి జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడిందనే కథతో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘చిత్రాంగద’. అంజలి టైటిల్‌ పాత్రలో నటించిన ఈ చిత్రానికి ‘పిల్ల జమీందార్‌’ ఫేమ్‌ అశోక్‌ దర్శకుడు. తమిళంలో ‘యార్నీ’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి సెల్వగణేశ్, స్వామినాథన్‌ సంగీత దర్శకులు. త్వరలో పాటల్ని, వచ్చే నెల 10న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌ ప్రకటించారు.

ఇంకా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఇప్పటి వరకూ భారతీయ తెరపై ఎవరూ టచ్‌ చేయని హారిజాంటల్‌ థ్రిల్లర్‌ కామెడీ చిత్రమిది. అంజలి నటన, ఆమె పాడిన పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ప్రేక్షకుల ఊహలకు అందని షాకింగ్‌ ట్విస్టులతో ప్రారంభం నుండి ముగింపు వరకూ ఉత్కంఠగా, ఆసక్తికరంగా దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారు. కథానుగుణంగా అమెరికాలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం’’ అన్నారు. సింధూ తులానీ, రక్ష, దీపక్, సాక్షీ గులాటీ నటించిన ఈ చిత్రానికి సమర్పణ: టీసీఎస్‌రెడ్డి, వెంకట్‌ వాడపల్లి.