తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా తమిళంలో మంచి గుర్తింపే సంపాదించుకుంది. తెలుగులో కూడా ఆమె కొన్ని హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆమె మలయాళ స్టార్ హీరో మమ్ముట్టితో కలిసి 'పెరంబు' అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అంజలి. ఇందులో ఆమెకి తన ప్రేమ, పెళ్లి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

హీరో జై తో తన ప్రేమాయణం గురించి మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా ఆమె ఎప్పుడూ స్పందించలేదు. కానీ తాజాగా అంజలి ఈ విషయంపై ఓపెన్ అయింది. అసలు జైతో తన అనుబంధం గురించి తాను ఎక్కడా చెప్పలేదని మీడియానే ఏదేదో ఊహించుకొని తమ చుట్టూ ప్రేమ కథ అల్లేసిందని దానికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించింది. 

ఒకప్పుడు ఇలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు తెగ బాధ పడిపోయి ఏడ్చేదాన్నని ఇప్పుడు మాత్రం అసలు పట్టించుకోకుండా కెరీర్ మీద దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది. పెళ్లి గురించి ఆలోచించే టైం కూడా లేదని చెప్పింది.