హీరోగా అనిరుధ్ రవిచందర్ ఎంట్రీకి రంగం సిద్దం, దర్శకుడు ఎవరంటే..?
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు.. ఓడలు బండ్లు.. బడ్లు ఓడలు అవుతంటాయి. ఇండస్ట్రీలో కూడా ఎవరూ ఎప్పుడూ ఒకేలాగా ఉండరు. తాజాగా అలాంటి ఓ రేర్ సిచ్యూవేషన్ తమిళ ఇండస్ట్రీలో కనిపించబోతోంది.

ఇప్పటికిప్పుడు సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే వినిపించే పేర్లలో.. అనిరుధ్ పేరు ముందుంటుంది. అనిరుధ్ పేరు వినిపించినా చాలు మ్యూజిక్ లవర్స్ లో ఊపు వచ్చేస్తుంది. పాటలతో పాటు ఆరేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తుంటాడు అనిరుధ్. ఠఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు నేపథ్య సంగీతంతో గూస్‌బంప్స్ తెప్పిస్తుంటాడు అనిరుధ్. ఇక ఈమధ్య అనిరుధ్ మ్యూజిక్ కు ఫ్యాన్స్ ఎక్కువై పోయారు. అంతే కాదు సోషల్ మీడియాలో అనిరుధ్ కు ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు.
ఇక తాజాగా అనిరుధ్ కు సబంధించిన ఓ న్యూస్ తమిళ సోషల్ మీడియాడో వైరల్ అవుతోంది. అనిరుధ్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అనిరుధ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ మీడియాలు కోడై కూస్తున్నాయి. సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అనిరుధ్ కోసం ఓ కథను రెడీ చేస్తున్నాట. అంతేకాకుండా లోకేష్ సినిమాలకు పనిచేసే స్టంట్ మాస్టర్‌లు అన్బరవీలు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారట. అన్ని కుదరితే వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉందని సమాచారం.
అయితే ఇప్పటి వరకూ రూమర్ గా మాత్రమే ఉన్న ఈన్యూస్ నిజమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఈ మూవీలో అనిరుధ్ మ్యూజిక్ వాయించినట్టగా.. యాక్షన్ సీన్స్ లో కూడా వాయించి వదిలిపెట్టేలా కథను రెడీ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమా మొత్తం యాక్షన్‌తో నిండిఉండనుందట. యాక్షన్ నేపథ్యంలోనే లోకేష్ కూడా కథను రాసుకున్నాడట. ప్రస్తుతం చెన్నైలో ఇదే హాట్‌టాపిక్ అయింది.
ఇక ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత చిన్న హీరో అయినా.. ఆయనిచ్చే ఎలివేషన్ మ్యూజిక్‌కు అభిమానులు ఉర్రూతలూగిపోతుంటారు. ముఖ్యంగా విక్రమ్ లో కమల్ కు.. జైలర్‌లో రజనీకు అనిరుధ్ ఇచ్చిన మాస్ మ్యూజిక్‌కు తమిళ తంబిలే కాదు.. తెలుగు కుర్రాళ్లు సైతం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.ప్రస్తుతం అనిరుధ్ క్రేజ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఆయన బయట కనిపిస్తే జనాలు వెర్రెత్తిపోతున్నారు.