సందీప్ రెడ్డి వంగా చేసిన పనికి థియేటర్ ఓనర్స్ కు చెమటలు?
రెండు పార్ట్ లుగా రిలీజ్ చేద్దామంటే మరీ సాగతీసినట్లు అవుతుందని బావించారని అందుకే వద్దనుకుని మొదట అనుకున్న స్క్రిప్టు ప్రకారమే వెళ్లిపోతున్నట్లు సమాచారం.

డైరక్టర్స్ నమ్మేది తమ గట్ ఫీలింగ్స్ నే..ఫలానా సీన్ వర్కవుట్ అవుతుంది..ఫలానా ఎమోషన్ పే చేస్తుంది అని నమ్మితేనే ముందుకు వెళ్లగలుగుతారు. వాళ్లే స్టార్ డైరక్టర్స్ అవుతారు. మిగతా వాళ్లు వాళ్ల ఫాలోవర్స్ అవుతారు. సందీప్ రెడ్డి వంగా చేసింది రెండు సినిమాలే కానీ దేశం మొత్తం ఆయన సినిమా కోసం ఎదురుచూసే డైరక్టర్ గా ఎదిగారు. అందుకు ఆయన అనుసరించే వ్యూహం ఏమిటంటే తన గట్ ఫీలింగే అంటారు. తను అనకున్నది చేయటానికి వెనకాడరు. ఆయన పాత్రలు లాగానే ఆయన మొండిగా ముందుకు వెళ్తూంటారు. ఇప్పుడు యానిమల్ విషయంలోనూ అదే జరుగుతోంది అంటున్నారు.
సందీప్ రెడ్డి వంగా తాజా చిత్రం రణ్‌భీర్ కపూర్ చేసిన యానిమల్. ఈ మూవీ రన్‌టైమ్‌పై బాలీవుడ్ మీడియాలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుతున్నాయి. ఈ యాక్షన్ డ్రామా మూవీ మూడు గంటల పదిహేను నిమిషాల లెంగ్త్‌తో రిలీజ్ అవుతున్నట్లు వినిపిస్తోంది. కథ తను అకున్నట్లుగా యాజటీజ్ గా ,కన్వీన్సింగ్‌గా చెప్పాలంటే రన్‌టైమ్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని డైరెక్టర్ సందీప్ వంగా ఫిక్సైనట్లు సమాచారం. మొదటి మూడున్నర గంటలతో సినిమాని రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారట.
అయితే చాలా మంది సన్నిహితులు అంత లెంగ్త్ అంటే ఇబ్బంది అవుతుందని , థియేటర్ పరంగానూ ఇబ్బందులు ఎదురు అవుతాయని చెప్పటంతో ...చివరికి పావు గంట కత్తిరించి మూడు గంటల 15 నిమిషాలుగా రన్ టైమ్ ఫిక్స్ చేశారని చెప్పుకుంటున్నారు. రెండు పార్ట్ లుగా రిలీజ్ చేద్దామంటే మరీ సాగతీసినట్లు అవుతుందని బావించారని అందుకే వద్దనుకుని మొదట అనుకున్న స్క్రిప్టు ప్రకారమే వెళ్లిపోతున్నట్లు సమాచారం. దాంతో థియేటర్ ఓనర్స్ .ఇంతంత లెగ్త్ సినిమా అంటే ఒక షో అయిన తర్వాత నెక్ట్స్ షో కు ప్రిపేర్ అవ్వటానికి చాలా తక్కువు ఉంటుందని, అలాగే ఎక్కువ షోలు వెయ్యాలనన్నా సమయం సరిపోదని, న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ మా కష్టాలు కూడా గమనించాలి అంటున్నారు.
సందీప్ వంగా..కబీర్‌సింగ్ సక్సెస్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. యానిమల్‌లో రణ్‌భీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల రిలీజైన పాటల్లో రణ్‌భీర్‌కపూర్, రష్మిక కెమిస్ట్రీ, లిప్‌లాక్‌లు హైలైట్ అయ్యాయి. ఈ లిప్‌లాక్‌లు సినిమాకు ఓ రేంజిలో పబ్లిసిటీని తీసుకొచ్చాయి.