సారాంశం
సందీప్ రెడ్డి వంగా రూపొందించిన `యానిమల్` మూవీ కలెక్షన్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా దుమారం రేపుతుంది. దిల్‌రాజు హ్యాపీ అవుతున్నారు.
సందీప్ రెడ్డి రూపొందించిన `యానిమల్` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తుంది. థియేటర్ల వద్ద సందడి కొనసాగిస్తుంది. అదే సమయంలో భారీ కలెక్షన్ల దిశగా రన్ అవుతుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే మూడు వందల యాభై కోట్లు దాటింది. ఇక సోమవారం కూడా భారీ కలెక్షన్లని సాధించింది. ఏ సినిమాకి సాధ్యం కాని విధంగా ఇది నలభై కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. సహజంగా సోమవారం నుంచి కలెక్షన్లు పడిపోతుంటాయి. కానీ `యానిమల్`కి స్టడీగా ఉన్నాయి. బెటర్ గా నమోదు కావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ మూవీ మంచి వసూళ్లని రాబడుతుంది. జస్ట్ మూడు రోజుల్లోనే ఇది బ్రేక్ ఈవెన్ దాటింది. ఇప్పుడు లాభాల్లో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఆయన సుమారు 15కోట్లకి ఈ మూవీ హక్కులు దక్కించుకున్నారని సమాచారం. కానీ ఈ మూవీ మూడు రోజుల్లోనే దాటేసింది. తొలి రోజు 15.40కోట్ల గ్రాస్ సాధించింది. రెండు రోజు 12.45 కోట్లు, మూడో రోజు 12.20కోట్లు, నాల్గో రోజు నాలుగు కోట్ల 80లక్షలు వసూలు చేసింది.
మొత్తంగా తెలుగు రాష్టాల్లో నాల్గు రోజుల్లో 44.85కోట్ల గ్రాస్ సాధించగా, 23.05 షేర్ సాధించింది. సినిమా 15కోట్ల బిజినెస్ కాగా, ఇప్పుడు ఎనిమిది కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఇకపై వచ్చే కలెక్షన్లు అన్నీ డిస్ట్రిబ్యూటర్లకి లాభాలను తీసుకొస్తాయని చెప్పొచ్చు. ఈ లెక్కన దిల్‌రాజు పంట పండినట్టే అని చెప్పొచ్చు. దిల్‌రాజుకే కాదు ఎగ్జిబిటర్లకి కూడా పండగే అని చెప్పడంలో అతివయోక్తి లేదు.
ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 44.85కోట్లు, కర్నాటకలో 19.10కోట్లు, తమిళనాడు5.20కోట్లు, కేరళలో కోటీ యాభై లక్షలు, నార్త్ లో 222.15కోట్లు, ఓవర్సీస్‌లో 131.45కోట్లు వసూలు చేశాయి. మొత్తంగా 424.25కోట్లు సాధించింది. సుమారు 210కోట్ల షేర్ సాధించింది. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటుకుని లాభాల్లోకి వెళ్తుందని చెప్పొచ్చు. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు.