ముంబైలో యానిమల్ చిత్రం ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ ని బాబీ డియోల్ సందర్శించారు. అక్కడ ఆడియన్స్ నుంచి స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తుండడంతో బాబీ డియోల్ ఎమోషనల్ అయ్యారు. 

రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ యానిమల్. శుక్రవారం రోజు విడుదలైన ఈ చిత్రం సందీప్ స్టైల్ లోనే ఉంటూ ఆకట్టుకుంటోందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కొంతవరకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు కూడా వచ్చాయి. కానీ వాటితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద యానిమల్ చిత్రం బీభత్సం సృష్టిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మూడు రోజుల్లోనే యానిమల్ చిత్రం వరల్డ్ వైడ్ గా 300 కోట్ల గ్రాస్ సాధించింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు సందీప్ తెరకెక్కించిన బోల్డ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారని. చాలా వైవిధ్యంగా ఉండే తండ్రి సెంటిమెంట్, రణబీర్ నటన.. రష్మికతో కెమిస్ట్రీ.. ఫస్ట్ హాఫ్ లో పవర్ ఫుల్ గా ఉండే సన్నివేశాలు ఈ చిత్రానికి క్రేజీ రెస్పాన్స్ వచ్చేలా చేశాయి. 

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. ప్రతి ఒక్కరి నటన ఒకరిని మించేలా మరొకరు చేసారు అన్నట్లుగా ఉంది. బాబీ డియోల్ ఊహించని విధంగా కన్నీరు మున్నీరుగా ఏడ్చేశారు. ముంబైలో యానిమల్ చిత్రం ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ ని బాబీ డియోల్ సందర్శించారు. 

View post on Instagram

అక్కడ ఆడియన్స్ నుంచి స్టన్నింగ్ రెస్పాన్స్ వస్తుండడంతో బాబీ డియోల్ ఎమోషనల్ అయ్యారు. కొందరు ఫ్యాన్స్ తో కూడా బాబీ డియోల్ ముచ్చటించారు. ఈ క్రమంలో బాబీ డియోల్ నటనని వారంతా ప్రశంసించడంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయింది. దీని కోసమే ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్నా అంటూ బాబీ డియోల్ తన టీమ్ మెంబర్స్ దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడ్చేశారు. 

Scroll to load tweet…

ఆ తర్వాత కారులో కూర్చుని కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకప్పుడు బాబీ డియోల్ బాలీవుడ్ లో అద్భుతంగా రాణించారు. కానీ ఆ తర్వాత ఆయన కెరీర్ నెమ్మదించింది. యానిమల్ చిత్రంతో మళ్ళీ బాబీ డియోల్ లో జోష్ పెరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. యానిమల్ చిత్రంలో రణబీర్, రష్మిక, బాబీ డియోల్ తో పాటు అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రి నటించారు.