సందీప్ రెడ్డి వంగాతో నాని మీటింగ్.. ఏం ప్లాన్ చేస్తున్నారు బ్రో.. అంటున్న నెటిజన్లు..
యానిమల్ సినిమాతరువాత సందీప్ రెడ్డి క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఆయనతో సినిమా కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో సందీప్ రెడ్డితో నేచరల్ స్టార్ నాని కనిపించడంలో అందరిని ఆలోచనలో పడేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్నపేరు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాలో సందీప్ బాలీవుడ్ ఉలిక్కిపడేలా చేశాడు. కొంత మంది సందీప్ పై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొంత మందిమాత్రంఘాటుగా విమర్షలు చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో ఎలాంటి స్పందన వచ్చిందో.. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అలా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అందరి కళ్ళల్లో పడ్డాడు. ఒక రకంగా బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో పాపులారిటీ తెచ్చుకున్న సందీప్.. యానిమల్ సినిమాలతో ఏకంగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు.
యానిమల్ సినిమా భారీ విజయం సాధించడంతో సందీప్ వంగ సినిమాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సందీప్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్ లు.. స్టార్ హీరోలు ఉన్నారు. యానిమల్ సీక్వెల్, ప్రభాస్ తో పాటు యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్, అల్లు అర్జున్ తో ఒక సినిమా ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇంకా లచిరంజీవి ఛాన్స్ ఇస్తే ఆయనతో కూడా ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నా అన్నాడు సందీప్. అటు కంగనా రనౌత్ తో కూడా లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలని ఉందట సందీప్ కు.
ఇక సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేయడానికి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈక్రమంలో సందీప్ కూడా ఏ హీరోతో సినిమా ప్లాన్ చేస్తాడా..? సడెన్ గా ఏ హీరోతో అగ్రిమెంట్ చేసుకుని సర్ ప్రైజ్ ఇస్తాడా అని ఆత్రుతతో ఎదరు చూడాల్సిన పరిస్థితి.. ఈక్రమంలో ఆయన క్యాజువల్ గా ఏవరైనా హీరోతో కనిపిస్తే.. సినిమా చేస్తున్నాడేమో అనుకోవల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో ఉన్నాయి. ఈక్రమంలో తాజాగా ఓ ఫోటో అందరిని షాక్ కు గురిచేసింది.
తాజాగా నేచురల్ స్టార్ నాని, సందీప్ వంగ కలిసి ఎయిర్ పోర్ట్ లో కనపడ్డారు. గతంలో వీరిద్దరూ కలిసి యానిమల్, హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. వీరిద్దరూ ఎయిర్ పోర్ట్ లో కలిసి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు చూసి నానితో సందీప్ వంగ ఏం ప్లాన్ చేస్తున్నాడో అనుకుంటున్నారు నెటిజన్లు. అయితే వీరిద్దరూ చెన్నైలో జరిగే బిహైండ్ వుడ్ అవార్డ్స్ ఫంక్షన్ కి వెళ్తున్నట్టు, ఆ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో కలిసి వెళ్లినట్టు తెలుస్తుంది.