వరసపెట్టి సినిమాలు తీస్తూ బిజీగా ఉన్న ఎన్నారై బిజినెస్ మ్యాన్ అనీల్ సుంకర...త్వరలో ఓ పూర్తి స్దాయి సినిమా వార్తలు ప్రసారం చేసే టీవీ ఛానెల్ ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ ఛానెల్ మరేదో కాదు..గతంలో ఆయన మొదలెట్టి ప్రక్కన పెట్టేసిన ఎటివీనే.  ఇప్పుడు మళ్లీ ఆ టీవి ఛానెల్ ని మరోసారి రీ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం రకరకాల టై అప్ లు , కొత్త ఆలోచనలు, టీమ్ ,ప్లాన్స్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎ టీవీ ఛానెల్ ని ప్రత్యేకంగా సినిమా వార్తలు,లేటెస్ట్ అప్ డేట్స్, లైవ్ ఈవెంట్స్, షూటింగ్ అప్డేట్స్, గాసిప్స్, న్యూస్ తో రన్ చేయాలని నిర్ణయించుకున్నారట. తమ సినిమాల పబ్లిసిటీ నిమిత్తం బయిట టీవి ఛానెల్స్ కు చాలా డబ్బు పే చేస్తున్న నేపధ్యంలో ఆయన తమ ఛానెలే ఉంటే తమ సినిమాలకు ఉచిత పబ్లిసిటీ దక్కుతుందనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెపుతున్నారు.

అలాగే ఆయన సన్నిహితులైన సినిమావాళ్లు చాలా మంది తక్కువ రేటుకు యాడ్స్ తీసుకునే టీవి ఛానెల్ ఉంటే ...మోనోపలిగా ఉన్న తెలుగు ఛానెల్స్ కు చెక్ చెప్పవచ్చని భావించి అనీల్ సుంకర చేత రీలాంచ్ చేయిస్తున్నట్లు సమాచారం.

పెద్ద నిర్మాతలంతా తమ సినిమాల లైవ్ కవరేజ్ లు ఎక్సక్లూజివ్ గా ఎటీవికే ఇచ్చేటట్లు మాట్లాడుకుని రంగంలోకి దిగుతున్నాడంటున్నారు. ఇక ఈ ఛానెల్ ఉగాది నుంచి లైవ్ లోకి రానుంది.  అలాగే తమ ఛానెల్ లో ప్రసారం చేసేందుకు గాను చాలా సినిమాల రైట్స్ ని అనీల్ సుంకర తీసుకుంటున్నారు.

ప్రస్తుతం టీవి ఛానెల్స్ అన్ని  పెయిడ్ ఛానెల్స్ గా మారిన నేపధ్యంలో ఎటీవిని ఫ్రీగా ఉంచుతారని , దాంతో వ్యూయిర్ షిప్ వస్తుందని, యాడ్స్ ద్వారా రెవిన్యూ జనరేట్ చేసి రన్ చేద్దామని ఆలోచన అని చెప్తున్నారు.