ఖరీదైన తప్పులు చేసాం: అనీల్ సుంకర
తాము గతంలో ఖరీదైన తప్పులు చేసామని ఈ సారి అవి రిపీట్ కావని ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ చూడండి.

ఒక టైమ్ లో తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ అనీల్ సుంకర. ఆయన పట్టిందల్లా బంగారం. దూకుడు, లెజెండ్, సరిలేరు వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నిర్మాతగా భాగమైన అనిల్ సుంకరకు గత కొంతకాలంగా కలిసి రావటం లేదు. వరస ప్రాజెక్టులు డిజాస్టర్ అవ్వటంతో నష్టాల్లో కూరుకుపోయాడు. గత రెండేళ్లలో మూడు అల్ట్రా డిజాస్టర్‌లతో దాదాపు రెండొందల కోట్లకు పైగా నష్టాలు వచ్చాయని ఇండస్ట్రీ టాక్. సినిమా కోసం ఎంత వరకైనా వెళ్ళే ఆయన, బడ్జెట్‌కు పరిధిలంటూ పెట్టుకోడని నిర్మాతగా మంచి పేరు ఉన్న ఆయన ఇలా ఇబ్బంది పడటం చాలా మందికు బాధ కలిగిస్తోంది. ఆర్‌ఎక్స్100తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అజయ్ భూపతితో మహాసముద్రం అనే మల్టిస్టారర్ తెరకెక్కించి వదలటం ఆయన్ను మొదట పెద్ద కొట్టింది.
మహా సముద్రం కు పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తిరిగిరాలేకపోయాయి. ఇక అఖిల్ మీద ఏకంగా రూ.80 కోట్లు పెట్టి తీసిన ఏజెంట్.. పది శాతం కూడా రికవరీ చేయలేకపోయింది. ఆ నష్టాల్ని చిరంజీవి భోళా శంకర్ కొంతైనా భర్తి చేస్తుందనుకుంటే.. అదీ కొత్తగా భారీ నష్టాల్నే తెచ్చిపెట్టింది. అయితే తాజాగా ఆయన 'ఊరు పేరు భైరవకోన'కు అనే చిత్రంతో ముందుకు వస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు పెద్దగా క్రేజ్ లేదనే చెప్పాలి. సందీప్ కిషన్ మార్కెట్ డల్ గా ఉండటమే అందుకు కారణం. ఈ చిత్రం పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్బంగా నిర్మాత అనీల్ సుంకర ... తాము గతంలో ఖరీదైన తప్పులు చేసామని ఈ సారి అవి రిపీట్ కావని ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ మీరూ చూడండి.
ఇక ఊరు పేరు భైరవ కోన విషయానికి వస్తే ..ఇప్పటికే రిలీజైన టీజర్‌తోనే మేకర్స్ సినిమా కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో చెలామణిలో ఉన్న గరుడపురాణంకు ఇప్పటి గరుడపురాణంకు నాలుగు పేజీలు తగ్గాయని, ఆ నాలుగు పేజీలే భైరవ కోన అంటూ టీజర్‌తోనే సినిమా ప్లాట్‌ను చెప్పేశారు. మరీ ఆ మాయమైన పేజీల్లో ఏమి ఉన్నాయి. అసలు భైరవకొనలో ఏం జరుగుతుంది అనే అంశాలతో సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశారు. టీజర్‌లో ఈ ఊరిలోకి రావడమే కానీ, బయటకు పోవడం ఉండదంటూ వచ్చిన డైలాగ్ విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. దర్శకుడు విఐ ఆనంద్ చాలా కాలం తర్వాత తనకు ఎంతో ఇష్టమైన సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో సినిమా చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.