సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ ని నమ్మని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. సెంటిమెంట్ ని నమ్మకపోవటం కూడా ఓ సెంటిమెంట్ గా చలామణి అయ్యే బ్యాచ్ ఉంది. ఫలానా ఆఫీస్ బోయ్ ని పెట్టుకుంటే సినిమా హిట్ అయ్యిందనే నమ్మకాలు కూడా ఈ ఫీల్డ్ లోనే కనపడతాయి. ఫలానా తేదీన రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మి, ఆ రోజు కోసం వెయిట్ చేస్తూంటారు. ఇది కేవలం తెలుగు పరిశ్రమకు సంభందించి మాత్రమే కాదు ..అన్ని సినిమా పరిశ్రమల్లోనూ ఈ సెంటిమెంట్ రన్ అవుతూంటుంది. ఈ సెంటిమెంట్స్ ...పరిశ్రమని బయిట నుంచి చూసేవాళ్లకు చాలా వింతగా కనపడతాయి. అవి నిజమూ కావచ్చు..కొట్టిపారేయలేము అనిపిస్తూంటాయి.  అలాంటి సెంటిమెంట్ ఒకటి సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి మహేష్ బాబు ఫ్యాన్స్ లో  మొదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే...

అనీల్ రావిపూడి రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో ఓ సినిమా కు రచన చేసారు. ఆ సినిమా మరేదో కాదు ...రామ్,వెంకీ కాంబినేషన్ లో వచ్చిన మసాలా. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వెంకీతో ఎఫ్ 2 చేస్తే పెద్ద హిట్టైంది. అలాగే అనీల్ రావిపూడి ..అప్పట్లో మహేష్ బాబు ఆగడు సినిమాకు రచన చేసారు. ఆ సినిమా డిజాస్టర్. కానీ ఇప్పుడు అదే మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అంటున్నారు. వినటానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ ఈ సెంటిమెంట్. అయితే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఎఫ్ 2 ని మించిన హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు.

ప్రముఖ నిర్మాత  దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారు. అలాగే.. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, అజయ్, బండ్ల గణేష్‌ ఇతర పాత్రలు కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.