రూ 3.5 కోట్లు వృధా అయినట్లే.. భగవంత్ కేసరిలో ఆ రీమిక్స్ సాంగ్ పక్కన పెట్టేసిన అనిల్ రావిపూడి
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అంటే మరికొన్ని గంటల్లోనే ఈ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. అ
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అంటే మరికొన్ని గంటల్లోనే ఈ చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే.
అందులోనూ వీరసింహారెడ్డి హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. బాలకృష్ణ తొలిసారి తెలంగాణ యాసలో నటిస్తున్న చిత్రం ఇది. రిలీజ్ కి ముందే ఈ చిత్రంపై సాలిడ్ బజ్ ఏర్పడింది.
అయితే ఈ చిత్రంలో అనిల్ రావిపూడి పాటలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బాలయ్య ఎనెర్జీ, కథాబలం, తన టేకింగ్ ని నమ్ముకునే అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అనిల్ రావిపూడి ఈ భగవంత్ కేసరి చిత్రం కోసం 3.5 కోట్ల ఖర్చుతో చిత్రికరించిన ఒక సాంగ్ ని మూవీ నుంచి కట్ చేసినట్లు తెలుస్తోంది.
అది కూడా అలాంటి ఇలాంటి సాంగ్ కాదు. బాలయ్య సూపర్ హిట్ సాంగ్ 'దంచవే మేనత్త కూతురా' పాటని అనిల్ రావిపూడి ఈ చిత్రంలో రీమిక్స్ చేశారట. అయితే బాలయ్య ఫ్యామిలీకి, ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులకు భగవంత్ కేసరి చిత్రాన్ని స్పెషల్ ప్రీమియర్ గా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. వారి నుంచి ఈ చిత్రానికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చిందట.
కానీ రీమిక్స్ సాంగ్ వద్దని సలహా ఇచ్చారట. కథ ఫ్లోని సాంగ్ దెబ్బతీసే విధంగా ఉందని ఫీడ్ బ్యాక్ రావడంతో అనిల్ రావిపూడి ఆ సాంగ్ ని తొలగించినట్లు తెలుస్తోంది. అయితే అవసరమైన రెండవ వారంలో యాడ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది 3.5 కోట్లు వృధాగా ఖర్చయినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.