పొలిటికల్ లీడర్లను మించిపోయిన అనిల్ రావిపూడి.. ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’ ప్రచారంలో ఫుల్ బిజీ..

తెలుగు ఓటీటీ సంస్థ ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్’తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 2తో రాబోతున్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. 

Anil Ravipudi Comedy Stock Exchange S2 On AHA  coming soon NSK


టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi ఇటీవల పార్టీ పెట్టబోతున్నట్టుగా  అందరి దృష్టిని ఆకర్షించాడు. రాజకీయ నాయకుడిలా తెల్ల చొక్కా. ధోతీ, కండువా ధరించి ఉన్న స్టిల్‌ను పంచుకున్నాడు. ఓ వీడియోను కూడా విడుదల చేశారు. అయితే, ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా (Aha) నుంచి ఈ అప్డేట్ రావడంతో అభిమానులు ఖుషీ అయ్యారు. మరేదైనా ఇంట్రెస్టింగ్ షోను డిజైన్ చేస్తున్నారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. 

ఇక తాజాగా సూపర్  అనౌన్స్ మెంట్ ఇచ్చారు. గతంలో అనిల్ రావిపూడి జడ్జీగా Comedy stock Exchange  షోను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఓటీటీలో కామెడీ షోను తీసుకురావడం విశేషం. సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి యాంకర్లుగా.. వేణు, ముక్కు అవినాశ్, సద్దాం, ఎక్స్ ప్రెస్ హరి, భాస్కర్, జ్నానేశ్వర్ టీమ్ లీడర్లు కామెడీని పంచారు. ఈసారి మరింత జోష్ గా తీసుకురాబోతున్నారు. అనౌన్స్ మెంట్ తోనే ఆసక్తిని పెంచారు. 

తాజాగా అప్డేట్ ఇస్తూ కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2  త్వరలో  ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అనౌన్స్ చేశారు. త్వరలోనే ఓటీటీలో ప్రసారం చేసేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టీమ్ లీడర్లు ముక్కు అవినాశ్, జ్నానేశ్వర్, భాస్కర్ ను కూడా అనౌన్స్ చేశారు. మిగితా అప్డేట్స్ కూడా అందించబోతున్నారు. బహుశా డిసెంబర్ మొదటి వారం నుంచి ఓటీటీలో ప్రసారం కానుందని తెలుస్తోంది. 

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ ఫీవర్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి కూడా తమ షోను పొలిటికల్ యాంగిల్ లోనే ప్రమోట్ చేస్తున్నారు. రాజకీయ నాయకుడిగా మారి కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2పై మరింత ఆసక్తిని పెంచుతున్నారు. ఈసారి యాంకర్లుగా ఎవరస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక అనిల్ చివరిగా ‘భగవంత్ కేసరి’తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాత్రం ఈ కామెడీ షోపైనే నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా పొలిటికల్ ప్రచారాలనే మించేలా ఈషోపై ఆసక్తిని పెంచేలా చేస్తున్నారు. రకరకాలుగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. నిజమైనా రాజకీయ నాయకుల కంటే మనోడి ప్రచారం నెట్టింట బాగా కనిపిస్తుండటం విశేషం. 

Anil Ravipudi Comedy Stock Exchange S2 On AHA  coming soon NSK

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios