సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ ఇటీవల రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో తన మాజీ భర్తకు విడాకులిచ్చి ఇటీవల విశాగన్ ని గ్రాండ్ గా పెళ్లాడిన సౌందర్యకు సూపర్ స్టార్ అభిమానుల నుంచి మొన్నటి వరకు విషెస్ బాగానే అందాయి. పెళ్లి పోటోలను అభిమానులు లైకులతో గట్టిగానే షేర్ చేసుకున్నారు. 

అయితే ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన ఫొటోలపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన భర్తతో హనీమూన్ కి వెళ్లిన సౌందర్య హ్యాపీగా ఉందంటూ కొన్ని పోటోలను షేర్ చేసింది. దీంతో ఆమెపై నెగిటివ్ కామెంట్స్ ఓ రేంజ్ లో వెలువడుతున్నాయి. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తున్నావ్ అంటే నిన్ను ఏమని పొగడలో అర్ధం కావడం లేదని కౌంటర్లు ఇస్తున్నారు. 

ఓ వైపు కాశ్మీర్ పుల్వామా జవానులపై జరిగిన దాడికి భారతావని ఆగ్రహంతో ఉంటే నువ్ హనీమూన్ పోటోలను పోస్ట్ చేస్తావా? మనం కోల్పోయింది నకిలీ సినిమా హీరోలను కాదు మేడమ్.. దేశం కోసం పోరాడే రియల్ హీరోలను కోల్పోయం అంటూ ఇలాంటి టైమ్ లో హనీమూన్ పోటోలను ఎలా పోస్ట్ చేయబుద్ది అవుతోంది అని సౌందర్య రజినీకాంత్ పై నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.