ఏంజెలినా జోలీ గురించి సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత నటి. హాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా ఓ వెలుగు వెలిగింది.
ఏంజెలినా జోలీ గురించి సినీ ప్రియులకు పరిచయం అవసరం లేదు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత నటి. హాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటిగా ఓ వెలుగు వెలిగింది. తన సౌందర్యం, నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని ఉర్రూతలూగించింది. యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది.
ఇక ఆమె వ్యక్తిగత జీవితం అంత సాఫీగా జరగలేదు. మూడు సార్లు ఆమె వైవాహిక జీవితం బ్రేక్ అయింది. చివరగా మూడేళ్ళ క్రితం ఏంజెలినా.. బ్రాడ్ పిట్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆమె వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెడితే.. ఏంజెలినా తన సొంతంగా ఎన్నో చారిటి కార్యక్రమాలు చేస్తోంది.
చిన్న పిల్లలని దత్తత తీసుకుని పెంచుతోంది. తాజాగా ఏంజెలినా మరోసారి అందరి హృదయాలు దోచుకుంది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అందరికి తెలిసిందే.

ఉక్రెయిన్ ప్రజలు వణికిపోతున్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. స్వస్థలాలు విడిచి దాదాపు 30 శాతం మంది ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. కొంతమంది చిన్నారులు తల్లిదండ్రులని కోల్పోయిన దయనీయ పరిస్థితులు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏంజెలినా వారందరిని పరామర్శించేందుకు ఉక్రెయిన్ లో పర్యటించారు. భారీ బందోబస్తు నడుమ ఆమె పర్యటన కొససాగింది. ఐక్యరాజ్యసమితి శరణార్ధుల ఏజెన్సీ తరుపున ప్రతినిధిగా ఆమె ఉక్రెయిన్ లోని లివివ్ నగరంలో పర్యటించారు.

ఆశ్రయం కోల్పోయిన ప్రజలు, చిన్నారులతో ముచ్చటించారు. వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేసింది ఏంజెలినా. అక్కడి పరిస్థితులని వాలంటీర్లు ఏంజెలినాకి వివరించారు. వారిని ఆదుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఏంజెలినా చేస్తున్నట్లు తెలుస్తోంది.
