‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె అంగన్వాడీ టీచర్ గా నటించింది. అయితే ఓ సన్నివేశంలో (Dasara) కీర్తి సురేష్ ఎవ్వరూ చూడకుండా.
నాని తాజాగా నటించిన చిత్రం దసరా.. శ్రీరామ నవమి రోజు ఎన్నో అంచనాలతో విడుదలకు అయ్యింది. ఈ మధ్య కాలంలో అంత రస్టిక్ లుక్ తో తెలుగు సినీ అభిమానులను ఆకర్షించిన చిత్రం ఇదే కావటంతో ఓ రేంజిలో ఓపినింగ్స్ వచ్చాయి. అలాగే రిలీజ్ కు ముందే పాటలకు, చిత్ర ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చింది. తెలంగాణ సింగరేణి బొగ్గు గని నేపథ్యంలో సాగే ఈ కథలో నాని `ధరణి`గా కనిపించారు. కీర్తి సురేష్ `వెన్నెల` పాత్రలో కనువిందు చేసింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదేలకు ఇదే మొదటి సినిమా అయినా.. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా తన సినిమాని రూపొందించాడు. కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. అయితే అనుకోని విధంగా ఈ సినిమా వివాదంలో ఇరుక్కుంది.
వివరాల్లోకి వెళితే.. ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె అంగన్వాడీ టీచర్ గా నటించింది. అయితే ఓ సన్నివేశంలో (Dasara) కీర్తి సురేష్ ఎవ్వరూ చూడకుండా.. ఆమె పనిచేస్తున్న చోటుకి వెళ్లి.. కోడిగుడ్లు, బియ్యం వంటివి దొంగతనం చేస్తున్నట్టు చూపించారు. అలాగే ఆమె ఆ గుడ్లు వంటివి తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు కూడా చూపించారు. ఈ సన్నివేశాల పట్ల అంగన్వాడీ టీచర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ హెచ్చరించడం కూడా చర్చనీయాంశం అయ్యింది.
‘ఐస్ డి ఎస్ లో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సేవలను గుర్తించకుండా అంగన్వాడీ టీచర్లు దొంగలు అన్నట్టు చూపించారు. ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ టీచర్లు చేస్తున్న సేవలు ఎవ్వరికీ తెలీదు. కేవలం రూ.150 జీతం నుండి పనిచేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు కేంద్రం మాకు ఏమీ ఇవ్వడం లేదు. అయినా మా సొంత డబ్బులు పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలు నడుపుతున్న సందర్భాలు ఉన్నాయి.మాకు జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో పాటు మేము అందరికీ పాలు, గుడ్లు వంటివి ఇచ్చామా లేదా అని ఫోన్లు కూడా చేస్తారు.
మేము ఫోటోలు కూడా తీసి పంపాలి. దర్శకుడు అవేవి చూడకుండా మమ్మల్ని దొంగలు అన్నట్టు సినిమాలో చూపించాడు. ఆ సన్నివేశాన్ని అర్జెంట్ గా తొలగించాలి. మేము ఆల్రెడీ సెన్సార్ బోర్డు సభ్యులకు లేక రాయడం జరిగింది. ఆ సన్నివేశాన్ని కనుక వెంటనే తొలగించకపోతే సినిమాని ఆడకుండా నిరసనకి దిరుగుతాము’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . ఈ సీన్‌పై అంగన్‌వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని థియేటర్ వద్ద ధర్నా చేశారు. ఆ సీన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు. సన్నివేశాన్ని తొలగించకపోతే సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్స్ వద్ద నిరసనకు దిగుతామని హెచ్చరించారు.
ఇక దర్శకుడు శ్రీకాంత్ గతంలో సుకుమార్ దర్శకత్వ బృందంలో రంగస్థలం, నాన్నకు ప్రేమతో సినిమాలకు అసోసియేట్ గా పనిచేశాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసారు. సంతోష్ నారాయణన్ సమకూర్చిన బాణీల్లో `చమ్కీల అంగీలేసి` అనే పాట ఇప్పటికే వైరల్ అయ్యి.. రీల్స్, షార్ట్స్ తో సోషల్ మీడియాలో భలే క్రేజ్ సొంతం చేసుకుంది. తమిళ నటుడు సముద్ర ఖని కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి సత్య సూరన్ కెమెరా వర్క్ చేశారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు. అన్ని హంగులతో నిర్మితమైన ఈ సినిమా అంచనాలు మించి దూసుకుపోతోంది. మరి దసరా టీమ్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
