ఏపీలో 'ఆదిపురుష్' టికెట్ ధరలు..ఎంత పెంచారు, ఎన్ని రోజులు ? కంప్లీట్ డీటెయిల్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ప్రభాస్ తొలిసారి పాన్ ఇండియా పౌరాణిక చిత్రంలో నటించడంతో ఆదిపురుష్ పై విపరీతమైన హైప్ ఉంది.

Andhra Pradesh Adipurush movie ticket price and details dtr

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ప్రభాస్ తొలిసారి పాన్ ఇండియా పౌరాణిక చిత్రంలో నటించడంతో ఆదిపురుష్ పై విపరీతమైన హైప్ ఉంది. రామాయణం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో పిల్లల నుంచి పెద్దల వరకు అంతా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.  

అయితే ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ప్రభాస్ అంతగా ప్రచార కార్యక్రమాల్లో కనిపించడం లేదు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఆదిపురుష్ చిత్రం జూన్ 16న రికార్డు ఓపెనింగ్స్ తో రిలీజ్ కాబోతోంది అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ అవుతుంటే టికెట్ ధరలు పెంచుకోవాలని నిర్మాతలు బయ్యర్లు భావిస్తారు. ఎందుకంటే మొదటి వారంలోనే అత్యధిక రికవరీ రాబట్టవచ్చు. ఆదిపురుష్ చిత్ర నిర్మాతలు కూడా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు టికెట్ ధరల పెంపు విషయంలో అప్లై చేశారు. ఇప్పటికే తెలంగాణాలో ఆదిపురుష్ టికెట్ ధరల పెంపుకు అనుమతి లభించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదిపురుష్ చిత్ర టికెట్ ధరలు పెంచుకునే విధంగా అనుమతి ఇచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ డే నుంచి మొదటి పది రోజుల వరకు పెంచిన టికెట్ ధరలు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. అలాగే మల్టిప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ లో రూ50 టికెట్ ధర చొప్పున పెంచుకునే విధంగా అనుమతి ఇచ్చింది. పెంచిన టికెట్ ధరలు కలుపుకుంటే మల్టిప్లెక్స్ లలో తొలి పది రోజుల పాటు రూ 234.. సింగిల్ స్క్రీన్స్ లో రూ 205 గా ఉండబోతోంది. పది రోజులు గడిచిన తర్వాత నార్మల్ టికెట్ ధరలు రూ.170.. రూ 147 కొనసాగుతాయి.  ఏపీ ప్రభుత్వం ఆదిపురుష్ చిత్రాన్ని సూపర్ హై బడ్జెట్ కేటగిరిగా  పరిగణించింది. 

Andhra Pradesh Adipurush movie ticket price and details dtr

అయితే అదనపు షోలకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతుండడంతో ఫ్యాన్స్ అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆదిపురుష్ పై అనేక వివాదాలు ఉన్నాయి.  ముఖ్యంగా ఏ చిత్రంలో దర్శకుడు పాత్రలని చూపిస్తున్న విధానంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదాలన్నీ అధికమించి ఆదిపురుష్ చిత్రం ఎంతటి విజయం సాధిస్తుందో అని సినీ లోకం మొత్తం ఎదురుచూస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios