తెలుగులో అత్యంత ప్రజాధరణ కలిసిన టెలివిజన్ షోలలో ఢీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. హై వోల్టేజ్ డాన్స్ లతో స్టేజ్ పై దుమ్ము రేపే డాన్స్ టీమ్స్ పెరఫార్మెన్సు ఒకెత్తయితే, యాంకర్స్, టీమ్ లీడర్స్, జడ్జెస్ చేసే అల్లరి మరో ఎత్తు. గత డాన్స్ షోలకు భిన్నంగా మధ్యలో కామెడీ స్కిట్స్, రొమాంటిక్ స్టెప్స్ తో యాంకర్స్ అలరిస్తున్నారు. ఈ వేదికపై రష్మీ గౌతమ్, సుధీర్ ల రొమాన్క్స్ ప్రత్యేక ఆకర్షణ. ప్రదీప్, సుధీర్ కామెడీ పంచ్ లకే ప్రేక్షకులు అల్లాడిపోతుంటే, ఢీ టీమ్ లోకి నాన్ స్టాప్ పంచ్ లతో అలరించే హైపర్ ఆది వచ్చి చేరారు.

కాగా ఈ షోలో ఎప్పటి నుండో యాంకర్ గా ఉన్న వర్షిణి సుందరరాజన్ మరియు ఆదిల రొమాన్స్ ఈ మధ్య హైలెట్ గా మారింది. ఇన్ని రోజులు షోలో ఉన్నా రాని గుర్తింపు, ఈ మధ్య వర్షిణి దక్కించుకుంది. ఇక గ్లామర్ ఫీల్డ్ కావడంతో నలుగురు గుర్తించాలి అంటే, హాట్ హాట్ ఫోటో షూట్ లు తప్పనిసరి. అందుకే అమ్మడు, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ మెస్మరైజ్ చేసే ఫోటోలు షేర్ చేస్తుంది.

తాజాగా ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ లో  ఓ బుజ్జిపాప ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ఎవరా అనుకుంటే ఆ ఫోటోలపై కొన్ని కామెంట్స్ తో వివరణ ఇచ్చింది వర్షిణి. ఆ పాప వర్షిణి మేనకోడలట. ఎప్పుడైనా తన రూమ్ లోకి తనని రానిస్తే,  మేకప్ కిట్స్ మొత్తం ఓపెన్ చేసి, ముఖానికి రాసుకుంటుదట. ఖరీదైన మేకప్ కిట్స్ పాడుచేస్తూ, తనని విసిగించేస్తుందని, వర్షిణి మేనకోడలు గురించి చెప్పుకొచ్చింది.