బిగ్ బాస్ 3: హాట్ యాంకర్ భారీ డిమాండ్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 22, Apr 2019, 3:30 PM IST
Anchor Udayabhanu Demanding 2 Lakhs Per Day?
Highlights

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా 'బిగ్ బాస్' కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా 'బిగ్ బాస్' కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది ఈ షో. రెండో సీజన్ లో సెలబ్రిటీలు ఎవరూ లేరనే విమర్శలు వినిపించాయి.

ఇప్పుడు అలాంటి విమర్శలకు తావివ్వకుండా కార్యనిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి ఇండస్ట్రీలో కాస్త పేరున్న వారినే షోలోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో ఒకప్పటి హాట్ యాంకర్ ఉదయభాను పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

ఇటీవల బిగ్ బాస్ టీం హీరో వరుణ్ సందేశ్, యాంకర్ ఉదయభానులను సంప్రదించినట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ ఈ షోలో కనిపించడం కోసం ఎంత డిమాండ్ చేశాడో తెలియదు కానీ ఉదయభాను మాత్రం రోజుకి రెండు లక్షలు డిమాండ్ చేస్తోందట.

ఆమెకున్న క్రేజ్ కి ఆ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పు లేదని భావిస్తున్నప్పటికీ.. ఆమె షోలో వంద రోజులు ఉంటే గనుక అప్పుడు ఆమె ఒక్కదానికే రెండు కోట్ల పారితోషికం చెల్లించాల్సి వస్తుంది. దీంతో షో నిర్వాహకులు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

తక్కువ మొత్తానికి ఆమెని ఒప్పించి షోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఉదయభాను మాత్రం రెమ్యునరేషన్ విషయంలో వెనక్కి తగ్గడం లేదట. మరేం జరుగుతుందో చూడాలి!
 

loader