యాంకర్ శ్యామల తన భర్తకు బాసటగా నిలిచారు. తన భర్త ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని.... రూ.కోటి కోసం ఓ ఆడపిల్లను మోసం చేయాల్సిన అవసరం ఆయనకు లేదని శ్యామల తేల్చిచెప్పారు. తన భర్తది ఆడపిల్లల్ని మోసం చేసే వ్యక్తిత్వం కాదని ఆమె వెల్లడించారు.
తన వద్ద రూ. కోటీ తీసుకుని అప్పు తీర్చుకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఫిర్యాదు మేరకు ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం కలిగించింది.
ఈ నేపథ్యంలో యాంకర్ శ్యామల తన భర్తకు బాసటగా నిలిచారు. తన భర్త ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టారని.... రూ.కోటి కోసం ఓ ఆడపిల్లను మోసం చేయాల్సిన అవసరం ఆయనకు లేదని శ్యామల తేల్చిచెప్పారు. తన భర్తది ఆడపిల్లల్ని మోసం చేసే వ్యక్తిత్వం కాదని ఆమె వెల్లడించారు.
అంతకుమందు మంగళవారం యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని హైదరాబాదులోని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read:యాంకర్ శ్యామల భర్త సహా మరో మహిళ అరెస్టు
తన వద్ద కోటి రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచి విడతలవారీగా నర్సింహా రెడ్డి డబ్బులు తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది.
అయితే ఆ వివాదంలో రాజీ కుదిర్చేందుకు మరో మహిళ రంగంలోకి దిగింది. నర్సింహారెడ్డితో సెటిల్మెంట్ చేసుకోవాలంటూ రాయబారం నడిపిందని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు తీసుకోవడంతో పాటు తనను లైంగికంగా కూడా వేధించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
