హైదరాబాద్: యాంకర్ శ్యామల భర్తను హైదరాబాదులోని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. శ్యామల భర్త నర్సింహా రెడ్డితో పాటు మరో మహిళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 

తన వద్ద కోటి రూపాయలు తీసుకుని ఇవ్వడం లేనది ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచి విడతలవారీగా నర్సింహా రెడ్డి డబ్బులు తీసుకున్నాడని, వాటిని తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. 

ఆ వివాదంలో మరో మహిళ రంగంలోకి దిగింది. నర్సింహారెడ్డి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ ఓ మహిళ రాయబారం నడిపిందని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.  డబ్బులు తీసుకోవడంతో పాటు తనను లైంగికంగా కూడా వేధించాడని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.