Asianet News TeluguAsianet News Telugu

యాంకర్‌ సుమ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్‌‌.. ఇంట్రెస్టింగ్‌ డిటెయిల్స్

ఒకప్పుడు నటిగానూ మెప్పించిన సుమ కనకాల తర్వాత గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. గ్రాండ్‌ ఎంట్రీకి ప్లాన్‌ చేసింది సుమ కనకాల. 

anchor suma re entry time fix as a actor intresting details
Author
Hyderabad, First Published Nov 3, 2021, 6:50 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సుమ కనకాల(Suma Kanakala) టీవీ రంగంలో తిరుగులేని వ్యాఖ్యాతగా రాణిస్తుంది. తెలుగు టెలివిజన్‌లో నెంబర్‌ వన్‌ పొజీషియన్‌ లో ఉంది. స్టార్‌ యాంకర్‌గా, అత్యంత బిజీయెస్ట్ యాంకర్‌గా రాణిస్తున్నారు. ఒకప్పుడు నటిగానూ మెప్పించిన సుమ కనకాల తర్వాత గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత మరోసారి నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. గ్రాండ్‌ ఎంట్రీకి ప్లాన్‌ చేసింది సుమ కనకాల. తాను నటిగా ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ఓ వీడియోని విడుదల చేసింది. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది. 

Suma Kanakala సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు యూనిట్‌. ఇప్పటి వరకు స్మాల్‌ స్క్రీన్‌పై బాస్‌గా రాణించిన Anchor Suma ఇప్పుడు పెద్ద తెరపైకి రాబోతుందని స్పష్టం చేశారు. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ 2గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు వెల్లడించారు. ఈసినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బలగ ప్రకాష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌ కలివరపు, అనుష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్ లుక్‌ని నవంబర్‌ 6న విడుదల చేయనున్నారు.

సుమ.. స్టార్‌ యాంకర్‌గా దాదాపు రెండు దశాబ్దాలపాటు బుల్లితెరని ఏలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ని ఏలేందుకు రాబోతుంది. 1996లో `కళ్యాణ ప్రాప్తిరస్తు` చిత్రంతో వెండితెరకి పరిచయమైంది సుమ. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌గా ఎదిగే ప్రయత్నంలో మలయాళ, తెలుగు చిత్రాలో నటించింది. హీరోయిన్‌గా, నటిగా పలు సినిమాల్లో మెప్పించిన సుమ.. ఈ క్రమంలో నటుడు రాజీవ్‌ కనకాల ప్రేమలో పడి వివాహం చేసుకుంది. నటిగా అవకాశాలు తగ్గే క్రమంలో యాంకరింగ్‌ వైపు అడుగులు వేసింది. అయినా పలు భారీ సినిమాల్లో మెరుస్తూనే ఉంది. `వర్షం`, `ఢీ`, `బాద్‌షా`, `ఓ బేబీ` చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది సుమ. 

కరోనా వల్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో చాలా మార్పులొచ్చాయి. సినిమా, టెలివిజన్‌ మాత్రమే కాదు డిజిటల్‌ రంగం కూడా విస్తరించింది. అయితే కొత్త టాలెంట్‌ వస్తుంది. యాంకరింగ్‌లోకి కొత్త వాళ్లు వస్తున్నారు. అనసూయ, రష్మీ, శ్రీముఖితోపాటు చాలా మంది కొత్త టాలెంట్‌ యాంకరింగ్‌లోకి వస్తున్నారు. అదే సమయంలో సినిమా ఫంక్షన్లు కూడా తగ్గిపోయాయి. ఒకప్పుడు సినిమా ఫంక్షన్లకి సుమ మాత్రమే ఆప్షన్‌గా ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో చాలా మంది వస్తున్నారు. దీంతో సుమ కూడా కెరీర్‌లో కొత్త టర్న్ తీసుకుంది. ఇటీవలే యూట్యూబ్‌ చానెల్‌ పెట్టింది. మరోవైపు ఇప్పుడు నటిగానూ తన యాక్టింగ్‌ టాలెంట్‌ని చాటుకోబోతుంది. మారుతున్న కాలానికి అనుగునంగా తను మారుతూ, అవకాశాలను పెంచుకుంటోంది. 

also read: Suma kanakala: వెండితెర రీఎంట్రీకి సిద్దమైన యాంకర్ సుమ.. మైండ్ బ్లోయింగ్ డిటైల్స్
 

Follow Us:
Download App:
  • android
  • ios