Asianet News TeluguAsianet News Telugu

రికార్డ్ క్రియేట్ చేసిన యాంకర్ సుమ తాత, గిన్నిస్ బుక్ కెక్కిన పెద్దాయన

అవ్వడానికి మలయాళీ అయినా.. అచ్చతెలుగు ఆడపిల్లలా.. టాలీవుడ్ ను ఏలుతోంది యాంకర్ సుమ. 50 ఏళ్లు వచ్చినా.. ఏమాత్రం స్టార్ డమ్ తగ్గకుండా.. దూసుకుపోతోంది సుమ. ఈక్రమంలో సుమకు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 

Anchor Suma Post Viral about Her Grand Father JmS
Author
First Published Nov 9, 2023, 2:44 PM IST

టాలీవుడ్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవ్వడానికి మలయాళీ అమ్మాయి అయినా.. తెలుగింటి కోడలుగా ఆమె తెలుగు అమ్మాయిలకంటే ఎక్కువగా.. స్పష్టంగా మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ వస్తున్నారు. యాంకర్ గా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు నటిగా సినిమాలు, యూట్యూబ్ వీడియోలు.. ఇలా ఒక్కటేమిటి.. ఎంటర్టైన్మెంట్ అంటే సుమ.. సుమ అంటే ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా కొనసాగుతోంది సుమ.

ఇక స్టార్ హీరో ప్రీరిలీజ్ ఉందంటే.. వారి ఫస్ట్ ఆఫ్షన్ సుమనే. ఆడియో రిలీజ్ లు, ప్రీ రిలీజ్ లుల్లో..  ఆడియన్స్ ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేస్తుంది సుమ. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా యాక్టీవ్ గా ఉంటుంది సీనియర్ స్టార్.. ఇక  అప్పుడప్పుడు నెట్టింట్లో  ఆమె తను చేసే వంటలు, తన ఫ్యామిలీ విషయాలు,  కుటుంబసభ్యుల విషయాలను కూడా సుమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె తన తాతయ్య గురించిన ఒక పోస్ట్ వేశారు.

 

సుమ తాతగారు ఈ వయస్సులో ఓ రికార్డ్ క్రియేట చేశారట. తాత అంటే.. సుమ వాళ్ల  అమ్మమ్మ గారి బ్రదర్. ఆయన పేరు పి బాలసుబ్రమణ్యన్ మీనన్ ఆయన వయస్సు 98 ఏళ్ళు. ఈ  వయసులో అరుదైన గౌరవం అందుకున్నారు. ఈయన ఒక అడ్వకేట్. గత 73 ఏళ్ళగా ఈయన ఈ ప్రొఫెషన్ లో వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇన్నాళ్ల లాంగ్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక లాయర్ గా మీనన్ వరల్డ్ రికార్డు సృష్టించారు. దీంతో గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు ఇది గమనించి.. ఆయనకు అవార్డుని అందించారు. 

ఇక ఈ విషయాన్ని యాంకర్ సుమ ఎంతో గర్వంగా తన  సోషల్ మీడియాలో పంచుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇటుసుమ కూడా యాంకర్ గా ఎన్నో రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇన్నేళ్లు యాంకరింగ్ ప్రొఫిషన్ లో కొనసాగిన వ్యక్తి మరొకరు లేరు. అది సుమకు మాత్రమే సాధ్యం అయ్యింది. ఆమె మరికొన్నేళ్ళు ఇలాగే కొనసాగితే..సుమ కూడా గిన్నిస్ రికార్డ్ సాధించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios