యాంకర్ సుమ కనకాల ఇంట విషాదం

First Published 3, Feb 2018, 1:11 PM IST
anchor suma mother in law passes away
Highlights
  • యాంకర్ సుమ కనకాల ఇంట విషాదం
  • సుమ భర్త రాజీవ్ కనకాల తల్లి లక్ష్మీ దేవి మృతి
  • లక్ష్మీదేవి మృతికి సంతాపం తెలిపిన మా అసోసియేషన్

 

యాంక‌ర్ సుమ భ‌ర్త‌, ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల తల్లి లక్ష్మీదేవి(78) ఈ ఉదయం కన్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె ఈ రోజు ఉద‌యం త‌న‌ స్వ‌గృహంలో తుది శ్వాస విడిచారు. 11 ఏళ్ల వయసులోనే నాటక రంగంలోకి ప్రవేశించిన లక్ష్మీదేవి .. నాట్యకారిణిగా, నటిగా కళామ్మ‌ తల్లికి సేవలు అందించారు. మొద‌ట‌ మద్రాస్‌ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కళాకారులకు ఉపాధ్యాయురాలిగా ఆమె శిక్షణ ఇచ్చారు.

 

లక్ష్మీదేవి భర్త దేవదాస్‌ కనకాల నటుడుగానే కాక పాటు ఫిలిం స్కూల్ కూడా నిర్వ‌హిస్తున్నాడు. లక్ష్మీదేవి పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో, కొబ్బరిబోండాం సినిమాలో రాజేంద్రప్రసాద్‌ తల్లి పాత్రలో నటించారు. కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆమె ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరారు.

loader