మేకప్ లేకపోతే సొంత ల్యాప్ ట్యాప్ కూడా గుర్తు పట్టలేదు.. యాంకర్ సుమ కష్టాలు వర్ణణాతీతం.. నెటిజన్లు రచ్చ
యాంకర్ సుమ.. మేకప్ లేకుండా బయట కనిపించదు. తనదైన యాంకరింగ్‌తో అలరించే ఈ అమ్మడు.. మేకప్ కష్టాలను స్వయంగా పంచుకుంది. తన ల్యాప్‌ట్యాప్ కూడా గుర్తు పట్టలేదట.

యాంకర్ సుమ ఇప్పుడు టాలీవుడ్‌లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె మీడియాపై ఓ ప్రెస్ మీట్‌లో చేసిన కామెంట్స్ వివాదంగా మారాయి. ఫుడ్‌పై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అది ట్రోల్స్ కి కారణమవుతుంది. ఈనేపథ్యంలో మరో రూపంలో ఇప్పుడు యాంకర్ సుమ నెట్టింట వైరల్ అవుతుంది.
మేకప్ రూమ్‌లో మేకప్ వేసుకుంటున్న వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది యాంకర్ సుమ. ఇందులో ఆమె ముందుగా మేకప్ లేకుండా కనిపించింది. అయితే తాను తన ల్యాప్ టాప్‌ని ఓపెన్ చేయాలనుకుంది. ఫేస్ స్కానింగ్ పాస్ వర్డ్ (Face Id) ని పెట్టుకుంది. మేకప్ లేకపోవడంతో ల్యాప్ ట్యాప్ గుర్తించలేదు. లాక్ ఓపెన్ కాలేదు. దీంతో ఆశ్చర్యపోయిన సుమ.. మేకప్ వేసుకున్నాక ల్యాప్ ట్యాప్ ముందు ఫేస్ పెట్టింది. దీంతో వెంటనే లాక్ ఓపెన్ అయ్యింది. ఇది చూసి నోరెళ్లబెట్టడం సుమ వంతు అయ్యింది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సందర్భంగా నెటిజన్లు స్పందిస్తూ రచ్చ చేస్తున్నారు. మేకప్ లేకపోతే మేమే గుర్తు పట్టలేం, ఇంకా ల్యాప్ ట్యాప్ ఏం గుర్తుపడుతుందని, అర్థరాత్రి అర్జెంట్‌గా ల్యాప్ ట్యాప్ ఓపెన్ చేయాల్సి వస్తే పరిస్థితేంటండి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. సుమక్కతో పెట్టుకుంటే అట్లుంటదని కామెంట్లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. సుమని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
ఇక సుమ కనకాల యాంకర్‌గా బిజీగా ఉంది. ఆమె ఓ వైపు టీవీ షోస్, మరో వైపు సినిమా ఈవెంట్లు చేస్తుంది. ఒకప్పుడు టీవీ షోస్‌తో బిజీగా ఉండేది. కానీ ఇప్పుడు ఒకటి రెండు షోస్ మాత్రమే చేస్తుంది. `సుమ అడ్డా`కి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు అప్పుడప్పుడు స్పెషల్ ఎపిసోడ్‌లు, టాక్ షోలు చేస్తుంది. అలాగే సినిమా ప్రెస్‌మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తుంది. కాకపోతే తన సొంత యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టా రీల్స్ పై ఫోకస్ పెట్టిందీ సీనియర్ యాంకర్. కొత్త యాంకర్ల జోరులు కాస్త సైడ్ ట్రాక్ తీసుకుని దూసుకుపోతుంది.