యాంకర్ సుమ అరెస్ట్ అయ్యింది. ఈ విషయంలో అల్లరి నరేష్‌ వేసిన ప్లాన్‌ బెడిసికొట్టింది. అనుకున్నది ఒక్కటి అయితే, జరిగింది మరోటి కావడం విశేషం. 

పాపులర్‌ యాంకర్‌ సుమ అటు టీవీ షోలు, ఇటు సినిమా ఈవెంట్లు చేస్తూ బిజీగా ఉంటుంది. దీనికితోడు ఇప్పుడు సెలబ్రిటీల ఇంటర్వ్యూలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. మొన్న యాంకర్‌ సుమ టీవీ షోలకు రిటైర్ మెంట్‌ ప్రకటించిందనే వార్త నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇప్పుడు ఆమె ఏకంగా అరెస్ట్ కావడం షాకిస్తుంది. అవును... యాంకర్‌ సుమ అరెస్ట్ అయ్యింది. ఆమె చేతికి బేడీలు వేసి కారులో తీసుకెళ్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యాంకర్‌ సుమని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏం జరిగిందని ఆరా తీయడం ప్రారంభిస్తున్నారు. ఇది అటు టాలీవుడ్‌ ఇటు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తీరా ఇప్పుడు ఆ విషయం బయటకొచ్చింది. సుమని అరెస్ట్ చేయడానికి కారణమేంటి? ఎవరు అరెస్ట్ చేశారనేది తేలిపోయింది. యాంకర్‌ సుమని హీరో అల్లరి నరేష్‌ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఆ ఫోటోని పంచుకున్నారు `ఉగ్రం` యూనిట్‌. 

ఇదంతా `ఉగ్రం` సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిందని తెలుస్తుంది. అల్లరి నరేష్‌ నటించిన `ఉగ్రం` సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్స్ ప్రారంభించారు. పాటలను విడుదల చేస్తున్నారు. తాజాగా సుమని అరెస్ట్ చేసినట్టుగా ఒక సస్పెన్స్ తో కూడిన ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేశారు. అయితే ఇదంతా `కస్టడీ` సినిమా ప్రమోషన్స్ కి అనుకున్నారట. చాలా వరకు దీనిపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నాగచైతన్య చేస్తున్న సినిమా `కస్టడీ` కూడా త్వరలో రిలీజ్‌ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం సుమని అరెస్ట్ చేసి ప్రమోషన్స్ పరంగా హైప్‌ క్రియేట్‌ చేయాలని భావించారేమో అని అనుకున్నట్టు నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. 

అసలు `ఉగ్రం` అనే సినిమా ఎవరి మైండ్‌లోనూ లేదు. అల్లరి నరేష్‌ సినిమా కోసం ఇంత హంగామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో నాగచైతన్య `కస్టడీ` చిత్రం కోసమే ఇలా చేసి ఉంటారని అభిమానులు, నెటిజన్లు భావించారు. కానీ తీరా అల్లరి నరేష్‌తో సుమ ఉన్న ఫోటోని విడుదల చేయడంతో అంతా అవాక్కవుతున్నారు. దీంతో అల్లరి నరేష్‌ టీమ్‌ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఇది నాగచైతన్య సినిమాకి కలిసి రావడం విశేషం. దీంతో అల్లరి నరేష్‌ సినిమా `ఉగ్రం` టీమ్‌ బకరా అయిపోయిందంటున్నారు నెటిజన్లు. ఇప్పుడిది నెట్టింట వైరల్‌ అవుతుంది. దీంతో `ఉగ్రం` నిర్మాతలు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చిందని టాక్‌.

Scroll to load tweet…

`నాంది` కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం `ఉగ్రం`. ఇందులో నరేష్‌.. సీఐ శివకుమార్‌గా నటిస్తున్నారు. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఇక నాగచైతన్య హీరోగా నటిస్తున్న `కస్టడీ` సినిమాకి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే 12న విడుదల కాబోతుంది.