మాస్ వార్తలతో.. న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తీన్ మార్ సావిత్రి.. అంచలంచెలుగా ఎదుగుతూ.. బుల్లితెరపై స్టార్ డమ్ సంపాదించింది.  ఇక ఇన్నాళ్ళు తన కెరీర్ కు కారణం అయిన జాబ్ ను మానేసిందట సావిత్రి. మరి ఏం చేయబోతుందంటే.. 

మాస్ వార్తలతో.. న్యూస్ రీడర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తీన్ మార్ సావిత్రి.. అంచలంచెలుగా ఎదుగుతూ.. బుల్లితెరపై స్టార్ డమ్ సంపాదించింది. ఇక ఇన్నాళ్ళు తన కెరీర్ కు కారణం అయిన జాబ్ ను మానేసిందట సావిత్రి. మరి ఏం చేయబోతుందంటే.. 


తీన్ మార్ సావిత్రి.. సావిత్రక్క.. జ్యోతక్క.. శివజ్యోతి ఇలా రకరాల పేర్లతో బుల్లితెరపై స్టార్ డమ్ సంపాదించింది శివజ్యోతి. తీన్ మార్ వార్తతో బాగా ఫేమస్ గా మారిపోయిన సావిత్రి.. ఆతరువాత ఎంత స్టార్ డమ్ వచ్చినా.. తన జాబ్ ను మాత్రం వదల్లేదు. అయితే ఇప్పుడు ఇమేజ్ పెరుగుతూ రావడం.. బిజీ షెడ్యూల్ తో .. తన జాబ్ ను మానేసింది జ్యోతి. ఈ విషయాన్ని బాధాతో వెల్లడించింది స్టార్ యాంకర్. అయితే జాబ్ మానేయడానికి గల కారణం కూడా వెల్లడించింది సావిత్రి. కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయబోతోంది. 

శివజ్యోతికి బిగ్ బాస్ తో బాగా పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ లో ఆమె ఏడుపులు.. సెంటిమెంట్ కు కరిగిపోయారు ఆడియన్స్. అంతే కాదు ఆమ చిన్న స్థాయి నుంచి ఎలా ఎదిగింది అనేది కూడా బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ లోకి తీసుకెళ్ళింది. దాంతో శివజ్యోతి ఇమేజ్ భారీగా పెరిగింది. ఈక్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో కూడా పాపులర్ అయ్యింది. పలు టీవీ షోష్ లో పాల్గొంటు..ఇంకాస్త ఇమేజ్ నుపెంచుకుంది సావిత్రక్క. 

మొదట్టో సోషల్ మీడియా మీద పెద్దగా అవగాహన లేని శివజ్యోతి.. ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో లక్షలలో ఫ్యాన్స్ ని సంపాదించుకొని దూసుకుపోతోంది. అయితే.. ఇన్నాళ్లు టీవీ ఛానల్ లో వార్తలు చదువుతూనే.. టీవీ ప్రోగ్రామ్స్, సొంతంగా యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ వచ్చిన శివజ్యోతి.. ఇప్పుడు తన జాబ్ మానేసినట్లు కొత్త వీడియో పెట్టి అందరికీ షాకిచ్చింది. ఇప్పటికే సొంతంగా జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న శివజ్యోతి.. తాజాగా జ్యోతక్క ముచ్చట్లు అని కొత్తగా మరో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇకపై శివజ్యోతి తెలంగాణ యాసలో శివజ్యోతి చెప్పే.. వార్తలన్నీ ఈ ఛానల్ లోనే పోస్ట్ చేయనున్నట్లు వీడియోలో తెలిపింది. తన ఛానల్ పేరుతో పాటు.. నా బలం మీరే నా బలగం మీరే అనే కాప్షన్ కూడా జోడించింది. 

ఈ ఛానల్ ని భారీగా ప్రమోట్ చేస్తుంది శివజ్యోతి. అది కూడా సినిమా లెవెల్ లో ప్రమోట్ చేసింది. అయితే.. తాను జాబ్ ఎందుకు మానేసిందో వివరిస్తూ.. వీడియోలో అర్ధమ్యేలా చెప్పేసింది బ్యూటీ. అంతే కాదు జాబ్ మానేసినందకు చాలా ఎమోషనల్ అయ్యింది శివజ్యోతి. ప్రస్తుతం తీన్ మాన్ సావిత్రి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. ఆమె ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో ఆల్ ది బెస్ట్ చెపుతున్నారు.