కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ట్రాన్స్ జెండర్ తమన్నా ప్రవేశించడం.. ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయింది. సోమవారం రోజు ప్రముఖ యాంకర్ శిల్పా చక్రవర్తి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించింది. 

శిల్పా ఎంట్రీపై బిగ్ బాస్ అభిమానుల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. శ్రీముఖి షో ఆరంభం నుంచి అటెన్షన్ పొందేందుకు, స్క్రీన్ స్పేస్ సొంతం చేసుకునేందుకు పాకులాడుతోంది. ఆమె అత్యుత్సాహాన్ని మిగిలిన ఇంటిసభ్యులు అడ్డురాలేక పోతున్నారు. మరోవైపు హౌస్ లో శ్రీముఖిని హైలైట్ చేసేలా ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. 

వీటన్నింటికి చెక్ పెట్టేందుకు, శ్రీముఖితో ముఖా ముఖి తలపడేందుకు శిల్పాని రంగంలోకి దించినట్లు అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. శిల్పా హౌస్ లోకి రాగానే శ్రీముఖి బలమైన కంటెస్టెంట్ అని కితాబిస్తూనే ఆమెని నామినేట్ చేసింది. 

రాహుల్, శ్రీముఖి మధ్య వైరం ఉన్నప్పటికీఆమెతో రాహుల్ వాదించలేకపోతున్నాడు. అందుకే ఇకపై హౌస్ లో శిల్పా.. శ్రీముఖికి బలమైన ప్రత్యర్థి కానున్నట్లు తెలుస్తోంది. రాగానే తనని నామినేట్ చేసింది కాబట్టి శిల్పాని శ్రీముఖి ఎలా టార్గెట్ చేస్తుందో చూడాలి.