యాంకర్ గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి ఎవరు ఊహించని విధంగా రీసెంట్ గా పోలీస్ స్టేషన్ దగ్గర కనిపించడం అందరిని షాక్ కి గురి చేసింది. రవిపై పొలిసు కేసు నమోదైనట్లు ఇతర మీడియాల్లో కథనాలు కూడా రావడంతో ఒక్కసారిగా న్యూస్ వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి రవిపై పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

ఇచ్చిన డబ్బులు తిరిగిచ్చేయాలని యాంకర్ రవి తనను ఫోన్ లో బెదిరించాడని అంతే కాకుండా 20 మందివ్యక్తులతో తనపై దాడికి ప్రయత్నించినట్లు సినీ డిస్ట్రిబ్యూటర్‌ సందీప్‌ చెప్పాడు. దీంతో ఎస్సార్ నగర్ పోలీసులు రవిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. విచారణకు రవి హాజరైనట్లు తెలుస్తోంది. 

అంతే కాకుండా అవసరమైనప్పుడు స్టేషన్ కు రావాల్సి ఉంటుందని రవికి పోలీసులు సూచించారు. 15 లక్షల అప్పు విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.