Asianet News TeluguAsianet News Telugu

కామన్ సెన్స్ లేదా..? 'సాహో' నెగెటివ్ రివ్యూలపై యాంకర్ రవి ఫైర్!

‘సాహో’ సినిమా అదిరిపోయింది.. రివ్యూలను అస్సలు నమ్మొద్దు. నేను నా ఫ్రెండ్స్‌‌తో కలిసి ‘సాహో’ సినిమా చూశా. నాతో పాటు నా ఫ్రెండ్స్‌కి కూడా చాలా బాగా నచ్చింది. వెయ్యిలో ఒక్కడికి నచ్చకపోతే సినిమా బాలేనట్టు కాదు.. మనస్పూర్తిగా చెబుతున్నా ‘సాహో’ సూపర్.
 

anchor ravi genuine review on prabhas saaho movie
Author
Hyderabad, First Published Aug 31, 2019, 4:47 PM IST

శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సాహో' సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా బాలేదంటూ నెగెటివ్ ప్రచారం చేస్తోన్న వారిపై యాంకర్ రవి మండిపడ్డారు. సినిమా చూసిన రివ్యూ ఇవ్వాలని అన్నారు. సినిమా తీయడం అంత సులువు కాదని.. అలాంటిది నెగెటివ్ రివ్యూలతో సినిమాను చంపేస్తున్నరంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. రూ.350 కోట్లు పెట్టి సినిమా తీయడం మామూలు విషయం కాదని..  తనకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందని.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమాను రూపొందించారని చెప్పారు. ఈ మధ్య కాలంలో రియాక్ట్ అవ్వడం మానేశానని.. కానీ ఈ సినిమా గురించి వీడియో పెట్టాలనిపించిందనిఅన్నారు.

''నేను సెలూన్ కి వచ్చా.. అక్కడ చాలా మంది సినిమా బాగుందని అంటుంటే.. ఒక అబ్బాయి మాత్రం సినిమా బాలేదని చెప్పాడు.. ఏం బాలేదని అడిగితే ఏమో అన్నా.. సినిమా చూడలేదు.. యూట్యూబ్ లో రివ్యూ చూశా.. బాలేదని రాశారని చెప్పాడు.. సినిమా కోసం పాజిటివ్ రాయకపోయినా పర్లేదు కానీ నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు.. అది కరెక్ట్ కాదు.. సినిమాను బతికిద్దాం..'' అంటూ చెప్పుకొచ్చాడు రవి.

కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించాలని.. మన కోసం రెండు, మూడేళ్లు కష్టపడి సినిమా చేస్తారని.. అలాంటిది వారు శ్రమ గురించి నెగెటివ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. యూట్యూబ్‌లో లైక్స్ కోసం ఏవోవే రాస్తున్నారని అది తప్పని.. ఇలా మాట్లాడడం వలన తనను కూడా తప్పు పట్టే వాళ్లు ఉంటారని.. అలా మాట్లాడినా తనకేం నష్టం లేదని చెప్పాడు. 

వీడియో కోసం క్లిక్ చేయండి

Follow Us:
Download App:
  • android
  • ios