బాలుడిపై కుక్కల దాడి ఘటనపై స్పందించింది యాంకర్ రష్మీ. జంతుప్రేమికురాలు అయిన రష్మీ.. ఈ విషయంలో ఎలా స్పందిస్తుందా అని అనుకుంటున్న టైమ్ లో.. తనవర్షన్ ను వివరించింది జబర్థస్త్ బ్యూటీ.
రీసెంట్ గా హైదరాబాద్ లో కుక్కల దాడిలో చిన్నారి మరణం అందరిని కలచి వేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ సంఘటనపై చిన్నా .. పెద్దా... అన్న తేడా లేకుండా.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ స్పందిస్తున్నారు. ప్రతీ ఒక్కరిని కలచివేసిన ఈ సంఘటనపై జంతు ప్రేమికురాలు.. స్టార్ యాంకర్ రష్మీ కూడా సోషల్ మీడియాలో స్పందించింది.
జబర్దస్త్ యాంకర్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది రష్మీ గౌతమ్. సోషల్ మీడియాలో ఆమె రచ్చ మామూలుగా ఉండదు. అటు హాట్ హాట్ అందాలతో అదరగొడుతూనే.. ఇటు సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గోంటుంది రష్మి. ముఖ్యంగా రష్మీ జంతు ప్రేమికురాలు. మూగజీవాల పట్ల జాలి కలిగి ఉండాలి అంటూ.. వీధి జంతువులపై ప్రేమతో ఉంటుంది.
ముఖ్యంగా లాక్డౌన్ లో తన మంచి మనసు చూపించింది రష్మీ. కరోనా కాలంలో వీధి కుక్కలకు ఆహారాన్ని అందించి శభాష్ అనిపించుకుంది. ఇలా ఎక్కడైనా మూగజీవాలపై ధాడులుజరిగితే..వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తుంది బ్యూటీ. ఇకఈ క్రమంలోనే తాజాగా అంబర్ పేటలో జరిగిన వీధి కుక్కల దాడిపై స్పందించింది యాంకర్ రష్మి. తన సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై ట్వీటర్ లో స్పందించిన రష్మి.. ఈ విధంగా రాసుకొచ్చింది. ఈ ఘటనలో ఆ బాలుడి తప్పేంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీధి కుక్కల సంతాన ఉత్పత్తి జరగకుండా చూడాలి.. వ్యాక్సినేషన్, వాటికి సరైన వసతి కల్పించడం లాంటివి చేయాలి అంటూ రష్మి సూచించింది. వాటికంటూ ఓ సపరేట్ ప్లేస్ ను మనం అందిచాలని అంటుంది రష్మి.
ఇక ఈ ఘటన అందరిని కలిచివేస్తోంది. ప్రతీ ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఇక ప్రభుత్వం కూడా ఈ విషయాన్నిసీరియస్ గా తీసుకుంది. దీనిపై కార్యాచరణ రూపోందిస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
