సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మి అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. 

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రష్మి అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇటీవల ఓ వీధి కుక్క జబ్బున పడితే దాన్ని చూసిన రష్మి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి తనవంతు సహాయం అందించింది. తాజాగా మరోసారి మూగజీవుల పట్ల తన ప్రేమను చాటుకుంది. ఈరోజు హోలీ సందర్భంగా అందరూ రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో అభిమానులు రష్మి సోషల్ మీడియా వేదికగా ఓ రిక్వెస్ట్ చేసింది. ''ప్రతి ఒక్కరికీ నా తరఫున ఒక విన్నపం. కుక్కలపై, ఇతర జంతువులపై రంగులు పూయకండి. పొరపాటున రంగులు వాటి కళ్లలో పడితే అవి చూపు కోల్పోతాయి. ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్లి మీ శరీరానికి అంటిన రంగులను శుభ్రంగా కడిగేసుకుంటారు. కానీ అవి అలా చేయలేవు'' అంటూ ట్వీట్ చేసింది. 

Scroll to load tweet…