సమాజంలో అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై యాంకర్ రష్మి మండిపడింది. ఇటీవల బీహార్ లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి యత్నించారు. వారిని ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది.

దీంతో ఆ నలుగురు యువకులు ఆమెపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా రష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది. రోజుకో కొత్త కేసు నమోదవుతుందని, గతంలో జరిగిన ఘటనల కంటే ప్రస్తుతం జరిగే ప్రతీ ఘటన ఎంతో భయానకంగా ఉంటోందని వెల్లడించింది.

మగాళ్లమని భావిస్తూ.. అఘాయిత్యాలకు పాల్పడే వారిని నరికిపారేయాలి ఫైర్ అయింది. అలా చేయకపోతే ఒక్క రాత్రిలోనే స్త్రీ అన్నది కనిపించకుండా పోతుంది. అలా చేసినప్పుడు మానవాళికి స్త్రీ జాతి విలువ తెలుస్తుందని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మి టీవీ షోలతో బిజీగా గడుపుతోంది.