‘‘ప్రభాస్ పక్కన నా ఫోటో ఎందుకు వేశారు..?’’

anchor rashmi fire on event manager
Highlights

మండిపడుతున్న యాంకర్ రష్మి

జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా.. ప్రేక్షకులను ఆకట్టుకున్న యాంకర్.. రష్మి.  యాంకర్ గా సూపర్ ఫేమస్ అయిన రష్మి.. సినిమాల్లో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంటోంది. త‌న గ్లామ‌ర్‌తో వెండితెర ప్రేక్ష‌కుల‌ను కూడా ఫిదా చేస్తోంది. దీంతో ప‌లు షాపింగ్ మాల్స్‌, మొబైల్ స్టోర్స్ ప్రారంభోత్స‌వాల‌కు ర‌ష్మి హాజ‌ర‌వుతోంది. 

అయితే.. తాజాగా ఓ ఈవెంట్ విషయంలో రష్మికి చాలా కోపం వచ్చింది. ఓ ఈవెంట్‌కు యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల‌తో క‌లిసి ర‌ష్మి హాజ‌ర‌వుతోందంటూ నిర్వాహ‌కులు ప్ర‌చారం చేసుకున్నారు. ఈ ప్ర‌చారం ర‌ష్మి వ‌ర‌కు వెళ్ల‌డంతో ఆమె ఆగ్ర‌హంగా స్పందించింది.
 
`ఎలాంటి అనుమతీ లేకుండా నా ఫోటో ఎలా వేస్తారు. ఈ ఈవెంట్ గురించి న‌న్నెవ‌రూ సంప్ర‌దించ‌లేదు. ఇలా అనుమ‌తి లేకుండా నా ఫోటో వేయడం ఇదే మొద‌టిసారి కాదు. ఫోటోలు వేసే ముందు సద‌రు సంస్థ‌ల సెలబ్రిటీల అంగీకార పత్రాల గురించి చెక్ చేయ‌వా` అంటూ ఆగ్ర‌హంగా స్పందించింది.

loader