బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్.. రాగానే దీప్తి సునైనాను ఏడిపించాడు

anchor pradeep wild card entry in bigg boss house
Highlights

అలా అడుగుపెట్టాడో లేదో.. ఇలా అందరినీ ఏడిపించేశాడు.

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్2 రాను రాను మరింత ఆసక్తిగా మారుతోంది. సీజన్ 1 ఎంత హిట్ అయ్యిందో.. సీజన్ 2 కూడా అదే రేంజ్ లో హిట్ చేసేందుకు స్టార్ మా టీం బాగానే ట్రై చేస్తోంది.

నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ఇచ్చిన ‘ బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా’ కాన్సెప్ట్ తో ఇంటి సభ్యులు చేసిన హంగామా వీక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా.. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ అడుగుపెట్టాడు.

అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రదీప్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.  ప్రదీప్ ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియో ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్ హౌజ్ లోకి అడుగుపెట్టిన వెంటనే సందడి మొదలైంది. 

 

ప్రదీప్ చెప్పిన పలు విషయాలకు ముందుగా దీప్తి సునైనా కంట తడి పెట్టుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కన్నీరు పెట్టుకున్నారు. అయితే.. ఆనందంతో వారు ఏడ్చినట్లు అర్థమౌతోంది. 

loader