తెలుగు బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ యాంక‌ర్ ప్రదీప్ మాచిరాజు త్వర‌లోనే పెళ్లిపీట‌లెక్కనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ 33 ఏళ్ల ప్రదీప్  ఫ‌లానా వారితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నార‌ని, ఫ‌లానా ఆమెతో ప్రదీప్ పెళ్లి అని ప‌లు వార్తలు గత కొంతకాలంగా వచ్చినా  కానీ అవేవీ నిజం కాలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ప్రదీప్ మాచిరాజు పెళ్లి గురించి వస్తున్న  వార్త మాత్రం నిజమే అంటున్నారు. 

అందులోనూ ప్రదీప్ పెళ్లి చేసుకోబోయేది సినిమా, టీవీ రంగాల‌కు ఏ మాత్రం సంబంధం లేని ఒక రాజ‌కీయ నాయ‌కురాలిని అనేది ఇప్పుడు మ‌రింత ఇంట్రస్టింగ్ గా మారింది.  తెలుగుదేశం పార్టీలో క్రియాశీల‌కంగా ప‌ని చేసే ఒక యువ రాజ‌కీయ నాయ‌కురాలితో ప్రదీప్ మాచిరాజు వివాహం కుదిరింద‌ని చెబుతున్నారు.ఆమె రాయలసీమ ప్రాంతానికి చెందినది వినపడుతోంది.  పెళ్లి చూపులు కూడా అయిపోయాయ‌ని, ఇరువైపుల వారు వివాహానికి ఒక నిర్ణయానికి వ‌చ్చార‌ని అంటున్నారు.ఇక, త్వరలోనే అధికారిక ప్రక‌ట‌న కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది.  
 
రీసెంట్ గా అలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్‌లో నీకు గ‌ర్ల్ ఫ్రెండ్ ఉండేది క‌దా అని ప్రదీప్‌ను అలీ అడిగాడు. మొద‌ట త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ సొనాలి బింద్రే అని దాటేశాడు ప్రదీప్‌. నిజ‌మైన పేరు చెప్పు అని అలీ అడిగాడు.

ఎందుకు స‌ర్‌, ఈపాటికి ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండి ఉంటారు అని ప్రదీప్ చెప్పాడు. ఈ షో కూడా చూస్తూ ఉంటుంది అని కూడా చెప్పాడు. ప్రదీప్ స‌మాధానం బ‌ట్టి ఆయ‌న ప్రేమించిన అమ్మాయికి మ‌రో పెళ్లి అయ్యింద‌నేది స్పష్టమైంది. దీంతో ఇప్పుడు ప్రదీప్ కూడా సెటిల్ కావ‌డానికి పెళ్లి చేసుకోవాల‌నే నిర్ణయానికి వ‌చ్చాడని అర్దమవుతోంది. అయితే, ప్రదీప్‌కు కాబోయే భార్య  అని చెప్పబడుతున్న ఆ  యువ నాయ‌కురాలు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.