నేరం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు జైలు శిక్ష?

anchor pradeep booked red handed for drunken driving
Highlights

  • తెలుగు బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న యాంకర్ ప్రదీప్
  • తాజాగా  తెలిసీ నేరం చేసి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డ ప్రదీప్
  • యాంకర్ ప్రదీప్ కు జైలు శిక్ష పడే అవకాశం

నూతన సంవత్సర వేడుకల్లో మద్యం నడిపి వాహనాలు నడపొద్దని పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఓపక్క పోలీసులు స్పెషల్ డ్రైవ్స్ పెట్టి రోడ్లపై మందుబాబులను రెడ్ హ్యాండెడ్ గా కెమెరా సాక్షిగా పట్టుకుంటున్నారు. అయితే... మద్యం తాగి వాహనం నడపటం నేరం అని తెలిసీ ప్రముఖులు సైతం తప్పు చేస్తున్నారు. నేరస్థులుగా మారుతున్నారు.

 

తాజాగా మద్యం మత్తులో కారు నడుపుతూ.. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ డిసెంబర్ 31 రాత్రి ఫుల్లుగా మందు కొట్టి తన కారు (టీఎస్ 07 ఈయూ 6666) డ్రైవ్ చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ప్రదీప్ కు పోలీసులు డిసెంబర్ 2న కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. బేగంపేటలోని కౌన్సెలింగ్ సెంటర్ మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాలని అతడిని పోలీసులు ఆదేశించారు.

 

ప్రదీప్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఇతర తాగుబోతులందరినీ ఒక చోట కూర్చోబెట్టి నిపుణులు కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ సందర్భంగా వారికి మధ్యం తాగి వాహనం నడపటం వల్ల జరిగే నష్టాలపై డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు. ఆపై కోర్టులో హాజరు పరుచనున్నారు.

 

ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ప్రదీప్‌ సేవించిన మధ్యం 178 పాయింట్లను చూపించింది. సాధారణంగా అయితే 35 పాయింట్లకు మించకూడదు. 178 పాయింట్లు వచ్చాయంటే ప్రదీప్ మద్యం ఏ స్థాయిలో సేవించాడో అర్థం చేసుకోవచ్చు. ప్రదీప్‌కు జైలు శిక్ష పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి కేసుల్లో శిక్ష మినహాయింపు ఉండదని అంటున్నారు.

 

కనీసం వారం రోజులు జైలు శిక్షగానీ లేదా... గరిష్టంగా మూడు నెలలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాక.. ప్రదీప్ తన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ లు పెట్టుకోవడంపై కూడా కేసు నమోదైనట్టు సమాచారం.

loader