యాంకర్ గా ఎప్పుడూ నవ్విస్తూ.. నవ్వుతూ.. పంచ్ లు వేస్తూ  హుషారుగా ఉంటాడు ప్రదీప్.. జడ్జిగా వచ్చినా.. కంటెస్టెంట్స్ ను మించి జోరుగా జోకులు వేస్తూ ఉంటారు శేఖర్ మాస్టర్.  అటువంటిది ఇద్దరు స్టార్స్  ఢీ స్టేజ్ పై కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకీ అంత ఎమోషనల్ ఎందుకు అయ్యారు కారణం ఏంటీ..?   

బుల్లి తెరపై.. ప్రోగ్రామ్స్ అంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో..అంత ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది.  ఎంత నవ్వుకుంటారో..  అంత  భావోద్వేగాలు కూడా ఉంటాయి. కొన్ని సార్లు పంచ్ లతో నవ్విస్తారు.. కొన్ని సార్లు వారిలో ఉన్న బాధను బయటకు చెప్పుకుని ఏడిపిస్తారు. ప్రస్తుతం టీవి షోలలో అది కామన్ అయిపోయింది. ఈక్రమంలో డీ, జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలాంటి షోలలో ఇలాంటికి ఎక్కువగా చూస్తుంటాం. తాజాగా ఇలాంటి సీన్ ఢీలో జరిగింది.  భావోద్వేగానికి గురైన స్టార్ కొరియోగ్రఫర్ శేఖర్ మాష్టర్.. స్టార్ యాంకర్ ప్రదీప్ ఇద్దరు హగ్ చేసుకుని మరీ ఏడ్చారు. 

 ఈ టీవీలో ప్రతి బుధవారం రాత్రి 9:30 నిమిషాలకు ఢీ 15 షో టెలికాస్ట్ అవుతూ.. డాన్స్ ప్రియులను అలరిస్తుంది. ఈ షోకి ఈసారి శేఖర్ మాస్టర్,తో పాటు శ్రద్ధాదాస్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఢీ షోలో ప్రదీప్ యాంకర్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ హుషారుగా, నవ్విస్తూ.. అందరిని ఆటపట్టిస్తూ  ఉండే శేఖర్ మాస్టర్.. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ పైకి వచ్చి ఏడ్చేశాడు. దాంతో అటు యాంకర్ ప్రదీప్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఆ పాయింట్ కి ప్రదీప్ కూడా కనెక్ట్ అయ్యాడు. ఇద్దరు కలిసి హగ్ చేసుకుని ఏడ్చారు. అసలు శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటంటే..? 

తాజాగా ఢీ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగానే కంటెస్టెంట్ లు తమ అద్భుతమైన ప్రదర్శనతో, కామెడీతో ఆకట్టుకోగా..చివర్లో మాత్రం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్ నవీన్ తన డాన్స్ లో ఒక స్కిట్ ను కూడా జత చేశాడు. అందులో తండ్రి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది. అందరిని కంటతడి పెట్టించింది. జడ్జిగా ఉన్న శ్రద్దా దాస్ కూడా ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది. నవీన్ పెర్ఫామెన్స్ కు అటు శేఖర్ మాస్టర్ కూడా బాగా బావోద్వేగానికి గురి అయ్యారు. 

ఇక ఈ పాటలో పూర్తిగా లీనమైపోయిన శేఖర్ మాస్టర్.. తన తండ్రిని తలుచుకొని ఏడ్చేశాడు. తండ్రి ఉన్నప్పుడే బాగా చూసుకోండి అంటూ.. యాంకర్ ప్రదీప్ ని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో మరో జడ్జీగా వ్యవహరిస్తున్న శ్రద్ధాదాస్, యాంకర్ ప్రదీప్ కూడా ఏడుపు ఆపుకోలేకపోయారు. అటు ప్రదీప్ కూడా రీసెంట్ గా తన తండ్రిని కోల్పోయాడు. దాంతో నాన్న గుర్తకు వచ్చి ప్రదీప్ కూడా ఏడ్చేశాడు. ఎప్పుడూ ఆనదంగా సందడి చేస్తూ కనిపించే శేఖర్ మాస్టర్, ప్రదీప్ ఇద్దరు ఇలా ఏడుస్తూ కనిపించడంతొ షోలో ఉన్న ఆడియన్స్.. కంటెస్టెంట్స్ తో పాటు.. ప్రొమో చూస్తున్న ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. రకరకాల కామెంట్లు  చేస్తున్నారు.