Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ లాస్య... కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!


యాంకర్ లాస్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. ఆమె మరోసారి తల్లైన విషయం ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

anchor lasya come up with good news she conceives again
Author
First Published Sep 21, 2022, 12:12 PM IST

బిగ్ బాస్ ఫేమ్ లాస్య మరలా తల్లి అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేశారు. భర్త మంజునాథ్ తో ఫొటోలకు ఫోజులిచ్చిన లాస్య తన మెడికల్ రిపోర్ట్స్ చూపించారు. కొన్నాళ్ల క్రితం మంజునాథ్ అనే వ్యక్తిని లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహాన్ని ఆమె పేరెంట్స్ ఒప్పుకోలేదు. దీంతో చాలా కాలం ఆమె తల్లిదండ్రులకు దూరంగా భర్తతో జీవించారు. అయితే లాస్య తల్లి అయ్యాక తల్లిదండ్రులు దగ్గరకు తీశారు. లాస్యను మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడు. కొడుకుని జున్ను అని లాస్య ప్రేమగా పిలుచుకుంటారు. 

తన ప్రేమ వ్యవహారాన్ని లాస్య బిగ్ బాస్ హౌస్ లో బహిర్గతం చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత లాస్య మళ్ళీ గర్భం దాల్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక లాస్య తల్లి అయ్యారని తెలుసుకున్న సన్నిహితులు, అభిమానులు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. 

కాగా యాంకర్ గా ఫేమస్ అయిన లాస్య బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన లాస్య అంచనాలు అందుకోలేకపోయారు. ఫెయిర్ గేమ్ ఆడుతూ ఆమె ప్రేక్షకుల తిరస్కరణకు గురయ్యారు. నాగార్జున సైతం ఆమెను ఫేక్ గేమ్, స్మైల్ అని నిందించారు. టైటిల్ విన్నర్ అభిజీత్, అలేఖ్య హారిక, సింగర్ నోయల్ తో లాస్య ఎక్కువగా కలిసి ఉండేవారు. వీరిది హౌస్ లో ఒక గ్రూప్ అని చెప్పాలి. లాస్య కనీసం ఫైనల్ కి కూడా చేరలేదు. 

ఇటీవల లాస్య అనారోగ్యం బారిన పడ్డారు. ఆసుపత్రిలో పేషేంట్ గా బెడ్ పై ఉన్న లాస్య ఫోటోను మంజునాథ్ షేర్ చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని వేడుకున్నాడు. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. హెవీ ఫీవర్ తో ఆసుపత్రిలో చేరిన లాస్య తిరిగి కోలుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios