Asianet News TeluguAsianet News Telugu

యాంకర్ ఝాన్సీ మేనేజర్ మృతి.. 35 ఏళ్లకే ఇలా, నా హృదయం బద్దలయ్యింది.. కంటతడి పెట్టిస్తున్న పోస్ట్

రెమ్యునరేషన్స్, సినిమాకి డేట్స్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలన్నీ మేనేజర్లే చూసుకుంటారు. సెలెబ్రెటీలకు, మేనేజర్లకు మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. తాజాగా యాంకర్ ఝాన్సీ తన మేనేజర్ ని కోల్పోయారు.

Anchor Jhansi manager dies, see her emotional post dtr
Author
First Published Nov 8, 2023, 9:56 AM IST

యాంకర్ ఝాన్సీ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆమె నాని దసరా చిత్రంలో ఎమోషనల్ గా నటించి మెప్పించారు. కామెడీ పండించడంలో, గయ్యాళిగా నటించడంలో ఝాన్సీ సిద్దహస్తురాలు.  ఝాన్సీ యాంకర్ గా కూడా ఎంతో గుర్తింపు పొందారు. 

ఝాన్సీ ఎలాంటి వివాదాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఆమె వ్యక్తిగత విషయాలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఆమె మాజీ భర్త జోగినాయుడు కూడా తరచుగా ఇంటర్వ్యూలు ఇస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఝాన్సీకి పర్సనల్ గా ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిత్ర పరిశ్రమలో సెలెబ్రిటీల కార్యక్రమాలన్నింటినీ డిసైడ్ చేసేది, నిర్వహించేది వారి మేనేజర్లే. 

రెమ్యునరేషన్స్, సినిమాకి డేట్స్ ఇవ్వడం లాంటి కార్యక్రమాలన్నీ మేనేజర్లే చూసుకుంటారు. సెలెబ్రెటీలకు, మేనేజర్లకు మధ్య మంచి అనుబంధమే ఉంటుంది. తాజాగా యాంకర్ ఝాన్సీ తన మేనేజర్ ని కోల్పోయారు. ఝాన్సీ మేనేజర్ శ్రీను (35) గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. దీనితో ఝాన్సీ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @anchor_jhansi

జాన్సీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. నేను ముద్దుగా శీను బాబు అని పిలుచుకుంటా. అతడు నా స్టాఫ్ మాత్రమే కాదు.. నా కుటుంబ సభ్యుడు. నానా పనులన్నీ శీను ఎంతో సమర్థవంతంగా నిర్వహించాడు. శీను నాకు పెద్ద సపోర్ట్. నన్ను ఎంతో బ్యాలెన్స్ గా ఉంచాడు. మంచి వాడు.. సహృదయుడు అంటూఅతడి గురించి తెలిపింది. హెయిర్ స్టైలిస్ట్ గా కెరీర్ ప్రారంభించి తనకి పీఏ గా మారాడని ఝాన్సీ పేర్కొంది. 

శీను చాలా నిజాయతీ పరుడు. నా తమ్ముడి కంటే ఎక్కువే. 35 ఏళ్లకే గుండెపోటు రావడం ఏంటో.. జీర్ణించుకోలేకున్నా. మాటలు రావడం లేదు. జీవితం నీటి బుడగ లాంటిది అంటూ ఝాన్సీ ఎంతో ఎమోషనల్ గా తన మేనేజర్ మృతిపై పోస్ట్ చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios