ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, చాలా మంది తనను మోసం చేశారంటూ నటి శ్రీరెడ్డి  టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో శ్రీరెడ్డికి సపోర్ట్ చేయకపోవడం మా తప్పేనని అంటోంది ప్రముఖ యాంకర్ ఝాన్సీ.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె శ్రీరెడ్డి ఉదంతంపై మాట్లాడుతూ.. ''ఇప్పటివరకు నేను కాస్టింగ్ కౌచ్ పెద్దగా మాట్లాడలేదు. ఈ వివాదంపై శ్రీరెడ్డి బయటకి వచ్చినప్పుడు నాలాంటి వాళ్లు సపోర్ట్ చేయకపోవడం, సైలెంట్ గా ఉండడం తప్పేనని అనుకుంటున్నాను. శ్రీరెడ్డి వ్యక్తిగత అభిప్రాయాల్లో తేడాలు ఉండొచ్చు కానీ ఆమె లేవనెత్తిన వివాదం మాత్రం పెద్ద ఇష్యూ.

మేము కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలని, అందరినీ సమానంగా చూడాలని అడుగుతూనే ఉన్నాం. శరీరాలతో బిజినెస్ చేసే ఈ ఇండస్ట్రీలో శరీరాలు తమకి ఇష్టం లేకుండా వాటిని వాడుకోబడ్డామనే వలలోకి అమ్మాయిల్ని దింపకూడదనే భావం ఉన్న దాన్ని నేను. కానీ శ్రీరెడ్డి విషయంలో బయటకి రాలేకపోయాను. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విషయంలో మేం సైలెంట్ గా అయితే లేం.

ఇండస్ట్రీలో అన్ని అసోసియేషన్స్ ని కలిశాం. నేను, నందిని రెడ్డి, సుప్రియ, మంచు లక్ష్మీ ఇలా అందరం కలిసి ఓ ప్యానెల్ గా ఏర్పడ్దాం. ఇండస్ట్రీలో ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎక్కడకి వెళ్లాలో తెలియక శ్రీరెడ్డి అలా చేసి ఉండొచ్చు. అలాంటివి జరగకుండా ప్లాట్ ఫాం ఏర్పాటు చేశామని'' చెప్పుకొచ్చింది.