ఇలాంటి బట్టలతో జెండా ఎగరేస్తావా.. అనసూయపై కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 15, Aug 2018, 5:05 PM IST
anchor anasuya fires on netizens
Highlights

అనసూయ అక్కడే ఉండడంతో ఆమెతో జెండా వందనం చేయించాలని నిర్ణయించుకొని ఆమెను అడగగా.. దానికి సరేనని జెండా ఎగరేసింది అనసూయ. అప్పటికప్పుడు హోటల్ యాజమాన్యం అడగడంతో ఆమె జెండా ఎగరేశారు

ఈరోజు 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యాంకర్ అనసూయతో భువనగిరిలో హోటల్ వివేరా యాజమాన్యం జెండా ఎగరవేయించింది. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. 'తొలిసారి జెండా ఎగురవేసినందుకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన వివేరా యాజమాన్యానికి నా కృతజ్ఞతలు' అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ పెట్టిన కొంతసేపటికి ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు కొందరు నెటిజన్లు.

జెండా ఎగరేసే సమయంలో ఆ డ్రెస్ ఏంటని ఆమె వస్త్రధారణను పట్టుబట్టారు. దీనిపై తీవ్ర అసహనానికి లోనైన అనసూయ ఈరోజు తనకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే కాదని ఆవేదన వ్యక్తం చేసింది. నిజానికి అనసూయ తన కుటుంబంతో కలిసి ట్రిప్ కి వెళ్లారు. తిరిగొచ్చే సమయంలో హోటల్ వివేరాలో టిఫిన్ చేయడానికి ఆగారు. అదే సమయంలో వివేరా యాజమాన్యం జెండా ఎగరవేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అనసూయ అక్కడే ఉండడంతో ఆమెతో జెండా వందనం చేయించాలని నిర్ణయించుకొని ఆమెను అడగగా.. దానికి సరేనని జెండా ఎగరేసింది అనసూయ. అప్పటికప్పుడు హోటల్ యాజమాన్యం అడగడంతో ఆమె జెండా ఎగరేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తనపై కామెంట్స్ చేసిన వారిని బ్లాక్ చేస్తున్నట్లు తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. కానీ కొద్దిసేపటికే ఆ వీడియో తొలగించారు.  

 

loader