సోషల్ మీడియా కామెంట్స్ కి వెంటనే స్పందిస్తుంది అనసూయ. వాలెంటైన్స్ డే నాడు కూడా ఆమె సహనంగా ఉండలేకపోయారు. భర్త గురించి అమర్యాదగా మాట్లాడంతో ఫైర్ అయ్యారు.
వాలెంటైన్స్ సందర్భంగా అనసూయ భర్తతో దిగిన ఫోటో షేర్ చేశారు. సదరు ఫొటోకు ''నీతో జీవితం రోలర్ కోస్టర్ రైడ్ వంటిది'' అని కామెంట్ చేశారు. భర్త భరద్వాజ్ తో తన జీవితాన్ని ఉద్దేశిస్తూ ఆమె సదరు కామెంట్ పోస్ట్ చేశారు. ఓ నెటిజెన్... 'అదేం లేదులే అక్కా వాడి దగ్గర బాగా డబ్బుంది, దట్స్ ఇట్' అని కామెంట్ చేశాడు. నెటిజెన్ చేసిన కామెంట్ కి అనసూయకు ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే రిప్లై ఇచ్చింది.
'అదేంట్రా తమ్ముడు అంత మాట అనేశావ్. డబ్బా ఎంత ఉందేంటి? మరి అక్క వద్ద లేదా డబ్బు? నీకు తెలుసుగా చెప్పు? అయినా నా డబ్బు, ఆయన డబ్బు అనేది కూడా ఉందా? బావగారికి పట్టుకొని వాడు వీడు ఏంట్రా, మర్యాదలేకుండా. నీ పెంపకం ఏంట్రా ఇలా ఉంది. చెంపలేసుకో లేదంటే నేనే వేస్తా చెప్పుతోటి...' అంటూ ఘాటైన రిప్లై ఇచ్చింది. అనసూయ సమాధానానికి సదరు నెటిజన్ మరో కౌంటర్ వేశాడు.
ఈ క్రమంలో అనసూయ-నెటిజన్ మధ్య వాడి వేడి చర్చ నడిచింది. ఈ గొడవ చూస్తున్న మరికొందరు... సెలెబ్రెటీలకు ఇలాంటి కామెంట్స్ సహజమే. స్పందిస్తే పెంటలో రాయి వేసినట్లు అవుతుందని అనసూయకు సలహా ఇస్తున్నారు. అనసూయ ఇతరుల మాదిరి కాదు. మితి మీరి ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే స్పందిస్తారు. తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సైబర్ కేసులు కూడా పెడతారు.
అనసూయ తనను ట్రోల్ చేసే చాలా మందిని అరెస్ట్ చేయించారు. ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించి ఫిర్యాదులు చేస్తారు. లైగర్ మూవీ మీద నెగిటివ్ కామెంట్ చేసి అనసూయ నెటిజన్స్ కి టార్గెట్ అయ్యారు. అనసూయను ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. లైగర్ విడుదల సమయంలో వరుసగా మూడు రోజులు అనసూయకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియా వార్ నడిచింది. ఈ క్రమంలో కొందరిపై ఆమె ఫిర్యాదులు చేశారు.
