వీకెండ్ లో అనసూయ చెమటలు కక్కిస్తుంది. జిమ్ ఫిట్ ధరించి కసరత్తులు చేసింది. అనసూయ వర్క్ అవుట్ వీడియో వైరల్ గా మారింది.
గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. చక్కని శరీరాకృతి సాధించాలంటే జిమ్ లో కష్టపడక తప్పదు. ప్రతి వీకెండ్ అనసూయ కఠిన కసరత్తులు చేస్తూ చెమటలు కక్కిస్తారట. అనసూయ తన వర్క్ అవుట్ వీడియో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. జిమ్ ఫిట్ లో బరువులు ఎత్తుతూ తెగ కష్టపడుతున్న అనసూయ కమిట్మెంట్ కి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. మేడం మీరు కేక అంటూ కితాబు ఇస్తున్నారు. నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న అనసూయ స్లిమ్ బాడీ మైంటైన్ చేయాలంటే వ్యాయామం చేయక తప్పదు. నటిగా రాణించాలంటే అందం, ఆరోగ్యం రెండూ కావాలి.
కాగా అనసూయ రంగమార్తాండ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని, ఆమె పాత్రను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీంతో అమ్మడు ఉబ్బితబ్బిబ్బవుతుంది. రంగమార్తాండ ప్రెస్ మీట్లో అనసూయ భావోద్వేగం ఆపుకోలేకపోయారు. జీవితానికి ఇది చాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. రంగమార్తాండ మూవీలో నటించడం అంత గొప్పగా అనసూయ భావిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో అనసూయ ప్రకాష్ రాజ్ కోడలు పాత్ర చేశారు.

క్రిటిక్స్ ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా ఈ చిత్రం రాబడుతుంది. కాగా అనసూయ ఖాతాలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్-రష్మిక మందాన జంటగా నటిస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్టైనర్ మీద దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి. పుష్ప 2లో అనసూయ నెగిటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాక్షాయణిగా అనసూయ పాత్రకు సుకుమార్ పుష్ప 2లో ఎలాంటి ముగింపు ఇచ్చాడో చూడాలి.
ప్రస్తుతం అనసూయ ఫోకస్ మొత్తం నటన మీదే. ఆమె యాంకరింగ్ పూర్తిగా మానేశారు. ఇకపై అటువైపు వచ్చేది లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఫేమ్ తెచ్చి పెట్టిన జబర్దస్త్ మీద కూడా అనసూయ పరోక్షంగా విమర్శలు చేయడం విశేషం. అనసూయ జబర్దస్త్ మానేసి దాదాపు ఏడాది కావస్తుంది.
