`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ లీడ్‌ రోల్‌ చేసిన సినిమా `థ్యాంక్యూ బ్రదర్‌`. రమేష్‌  రాపర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది.  విడుదలకు సిద్దంగా ఉంది. సరైన సమయం కోసం వెయిట్‌ చేస్తున్న నేపథ్యంలో కరోనా విజృంభన మరింతగా పెరిగింది. ఇప్పుడు థియేటర్లే బంద్‌ చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు. తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ `ఆహా`లో దీన్ని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

మే 7న ఈ సినిమాని `ఆహా`లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని సోమవారం చిత్ర బృందం తెలియజేసింది. వర్చువల్‌ మీటింగ్‌లో భాగంగా ఈ విషయాన్ని తెలిపారు. ఇందులో అనసూయ, నటుడు విరాజ్‌ అశ్విన్‌, దర్శకుడు రమేష్‌ రాపర్తి, నిర్మాత మాగుంట శరత్‌ చంద్ర రెడ్డి పాల్గొన్నారు. `ఆహా`లో ఈ సినిమాని విడుదల చేయడం పట్ల వాళ్లు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఓ యంగ్‌ కుర్రాడు, ఓ ప్రెగ్నెంట్‌ లేడీ అనుకోకుండా లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. అందులో ఏం జరిగిందనేది ఈ చిత్ర కథ. 

ఇప్పటికే `ఆహా`లో `క్రాక్‌`, `గాలి సంపత్‌`, `నాంది`, `లెవెన్త్ అవర్‌`, `మెయిల్‌`, `తెల్లవారితే గురువారం`, `చావుకబురు చల్లగా` చిత్రాలు విడుదలై మంచి రేటింగ్‌ని పొందారు. మంచి వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు వాటి జాబితాలో అనసూయన నటించిన `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రం చేరడం విశేషం. కరోనా విజృంభన నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీకి మళ్ళీ రోజులొచ్చాయి.